Admissions: న్యాయ విద్యలో ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రారంభం
Sakshi Education
ఎచ్చెర్ల క్యాంపస్: మూడేళ్లు, ఐదేళ్ల న్యాయ విద్య (ఎల్‌ఎల్‌బీ) ప్రవేశాలకు నవంబర్ 17న కౌ న్సెలింగ్ ప్రారంభమైంది.
ఆన్‌లైన్‌లో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. లాసెట్–2023 ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు అర్హులు. జిల్లాలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో మూడేళ్ల ఎల్‌ఎల్‌బీలో 66 సీట్లు ఉండగా, శ్రీకాకుళం పట్ణణంలోని వర్సిటీ అఫిలియేషన్ ఎంపీఆర్ కళాశాలలో మూడేళ్ల ఎల్‌ఎల్‌బీలో 88, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీలో 88 సీట్లు ఉన్నాయి. బార్ కౌన్సెల్ ఆఫ్ ఇండియా గుర్తింపు కళాశాలకు ఉంది.
చదవండి: Balasubramanian Menon: గిన్నిస్ రికార్డు సాధించిన కేరళ న్యాయవాది
షెడ్యూల్ మేరకు కౌన్సెలింగ్ 22వ తేదీ వరకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన, 21వ తేదీన ప్రత్యేక కేటగిరీల ధ్రువీకరణ పత్రాల పరిశీలన, 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఆప్షన్ల ఎంపిక, 26వ తేదీన ఆప్షన్ల మార్పు, 28వ తేదీన సీట్లు కేటాయించనున్నారు. 29, 30వ తేదీల్లో సీట్లు లభించిన విద్యార్థులు కళాశాలలకు రిపోర్టు చేయాల్సి ఉంటుంది.
Published date : 18 Nov 2023 12:06PM