Department of Health: వైద్యారోగ్య శాఖలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఎన్ని పోస్టులు ఉన్నాయంటే..?
Sakshi Education
వైద్య ఆరోగ్యశాఖలో మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్స్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
విశాఖపట్నం(మహారాణిపేట)లోని జోన్–1 పరిధిలో మొత్తం 8 పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ సుజాత తెలిపారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ల్లోని ఖాళీలను భర్తీ చేస్తున్నామని.. నెలకు రూ.25 వేలు వేతనంగా అందిస్తామన్నారు.
బీఎస్సీ(నర్సింగ్), బీఎస్(నర్సింగ్, సీపీసీహెచ్) చేసిన వారు ఈ పోస్టులకు అర్హులున్నారు. https://nagendrasvst.wordpress.com లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని.. పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 28 నుంచి జనవరి 12వ తేదీలోగా డీఎంహెచ్‌వో కార్యాలయ ఆవరణలోని రీజినల్ డైరెక్టర్ కార్యాలయంలో అందజేయాలని ఆర్డీ సుజాత కోరారు.
Central Bank of India Recruitment 2024: పదో తరగతి అర్హతతో 484 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
Published date : 27 Dec 2023 06:16PM
Tags
- Visakhapatnam District
- BSC nursing
- Dr.Sujatha
- Regional Director of Medical Health Department
- Medical Health Department
- Department of Health
- Health Department
- Recruitment Process
- Mid Level Health Providers Recruitment
- Public Health Job Opportunity
- Community Health Officers Vacancy
- Health Sector Recruitment
- latest jobs in 2023
- sakshi education job notifications