Jobs in EV Industry: ఈవీ ఇండస్ట్రీలో 50 మిలియన్ ఉద్యోగాలు.. వారం రోజులు శిక్షణ.. ఎక్కడంటే..
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ లారా ఇంజినీరింగ్ కళాశాలలో సరైటన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ టు అచీవ్ సస్టైనబుల్ ఎనర్జీ అనే అంశంపై వారం రోజులపాటు జరగనున్న అటల్ ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం డిసెంబర్ 12న ప్రారంభమైంది. టీ.రమేష్ మాట్లాడుతూ భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వెహికల్స్‌దేనని, దేశంలో రోజు రోజుకు పెరిగిపోతున్న జనాభా వలన ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగం పెరిగిందన్నారు.
ప్రస్తుతం ఇండస్ట్రీలకు ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగించే టెక్నాలజీపైన అనుభవం కలిగిన వారు తక్కువగా ఉండటం ప్రధాన సమస్యగా మారిందన్నారు. ఈవీ (ఎలక్ట్రిక్ వెహికల్) ఇండస్ట్రీలో 50 మిలియన్ ఉద్యోగాలు 2030 సంవత్సరం నాటికి క్రియేట్ చేయబడుతాయన్నారు. 2026 సంవత్సరం కల్లా ఇండియన్ ఆటోమొబైల్ రంగం బిజినెస్ 300 యూఎస్ బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని తెలిపారు.