Yantra India Ltd : యంత్ర ఇండియా లిమిటెడ్‌లో 3,883 ట్రేడ్ అప్రెంటిస్ శిక్షణకు దరఖాస్తులు
» ప్రాంతాల వారీగా ఫ్యాక్టరీలు: ఆర్డ్‌నెన్స్ కేబుల్ ఫ్యాక్టరీ–చండీగఢ్, ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ–నలంద, గన్ క్యారేజ్ ఫ్యాక్టరీ–జబల్‌పూర్, ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ–ఇటార్సీ, ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ–ఖమారియా, ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ–కట్ని, హై ఎక్స్‌ప్లోజివ్ ఫ్యాక్టరీ–కిర్కీ, ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ–అంబఝరి, ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ ప్రాజెక్ట్–అంబర్‌నాథ్ తదితరాలు.
» ట్రేడులు: మెషినిస్ట్, ఫిట్టర్, టర్నర్, వెల్డర్, పెయింటర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, మేసన్, ఎలక్ట్రోప్లేటర్, మెకానిక్, ఫౌండ్రీమ్యాన్, బాయిలర్ అటెండెంట్, అటెండెంట్ ఆపరేటర్ కెమికల్ ప్లాంట్ తదితరాలు.
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
» అర్హత: ఐటీఐ కేటగిరికి సంబంధించి అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి లేదా తత్సమానం, నాన్–ఐటీఐ కేటగిరికి సంబంధించి అభ్యర్థులు 50 శాతం మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
» గరిష్ట వయో పరిమితి: 35 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు సడలింపు ఉంటుంది.
» స్టైపెండ్: నెలకు నాన్–ఐటీఐలకు రూ.6000, ఐటీఐలకు రూ.7000 చెల్లిస్తారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
» ఎంపిక విధానం: నాన్–ఐటీఐ కేటగిరికి పదో తరగతి, ఐటీఐ కేటగిరికి పదో తరగతి, ఐటీఐలో సాధించిన మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 21.11.2024
» వెబ్‌సైట్: www.recruitgov.com/Yantra2024
Local Bank Officers : యూబీఐ శాఖల్లో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు
Tags
- Trade Apprentice Posts
- Apprentice Training
- YIL Recruitment 2024
- Jobs 2024
- online applications
- Job Vacancies
- YIL Nagpur Recruitment
- job notifications 2024
- ITI students
- Trade apprentice at YIL
- Eligible Candidates
- Yantra India Ltd Nagpur
- Ordnance
- Ordnance Equipment Factories
- Education News
- Sakshi Education News