Skip to main content

Job Opportunities: న‌ర్సింగ్ ఉద్యోగాలకు ప్రత్యేక శిక్షణ.. అర్హులైన‌ అభ్యర్థులు వీరే..

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్‌ అర్హతలు కలిగినవారికి జపాన్‌ దేశంలోని హాస్పిటళ్లలో కేర్‌ వర్కర్స్‌, కేర్‌ హోమ్‌ ఫెసిలిటేటర్‌గా ఉద్యోగ అవకాశాలు కల్పించే నిమిత్తం ఆసక్తి కలిగిన అభ్యర్థులకు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పన శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేశామని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఘంటా సుధాకర్ మార్చి 14వ తేదీ ఒక ప్రకటనలో తెలిపారు.
 State Skills Development Agency and District Employment Department in Eluru, Andhra Pradesh  Care Worker Training Program Announcement   Nursing Job Opportunities   Employment Training for Hospital Roles in Japan

జపాన్‌ భాషలో పూర్తి రెసిడెన్షియల్‌ తరగతి విధానంలో బెంగళూరు కేంద్రంగా ఆరు నెలల శిక్షణ ఉంటుందన్నారు. 18 నుంచి 32 సంవత్సరాల వయస్సున్న యువతీయువకులు ఈ శిక్షణకు అర్హులన్నారు. శిక్షణ కోసం రిజిస్ట్రేషన్‌ ఫీజుగా రూ.50 చెల్లించాల్సి ఉంటుందని, దీనిలో రూ.25 వేలు అభ్యర్థి చెల్లిస్తే మిగిలిన రూ.25 వేలు నైపుణ్యాభివృద్ధి సంస్థ చెల్లిస్తుందన్నారు.
అలాగే శిక్షణ నిమిత్తం అభ్యర్థులు రూ.3 లక్షలు చెల్లించాలని, శిక్షణ కాలంలో ఆరు నెలల పాటు ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పిస్తామన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి జపాన్‌లో నెలకు రూ.1.10 లక్షలు నుంచి రూ.1.40 లక్షల జీతంతో ఉద్యోగాలు కల్పించబడతాయని, ఇతర వివరాలకు 90302 27668 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.

Nursing Jobs: నర్సింగ్‌ ఉద్యోగ అవకాశాలు.. అర్హులైన‌ అభ్యర్థులకు ఉచిత శిక్ష‌ణ‌

Published date : 15 Mar 2024 01:57PM

Photo Stories