Job Opportunity: శనివారం మెగా జాబ్ మేళా..

సాక్షి ఎడ్యకేషన్: వికాస ఆధ్వర్యాన కలెక్టరేట్‌లో శనివారం మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నామని ప్రాజెక్ట్ డైరెక్టర్ కె.లచ్చారావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. హెచ్‌డీఎఫ్‌సీలో మేనేజర్లు, ఆఫీసర్లు, ఎగ్జిక్యూటివ్ పోస్టులకు, డెక్కన్ కెమికల్స్‌లో ట్రైనీ (ప్రొడక్షన్), సీఐఈ, డిక్సన్ కంపెనీల్లో టెక్నీషియన్ ఉద్యోగాలకు ఈ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని వివరించారు. ఉద్యోగాలకు పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ ఉత్తీర్ణులైన 30 సంవత్సరాలలోపు అభ్యర్థులు అర్హులని తెలిపారు.
PDSU: ‘హాల్ టికెట్ ఇవ్వకుండా వేధిస్తున్నరు’
ఆయా ఉద్యోగాలను బట్టి రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకూ జీతం, ఇన్సెంటివ్‌లు, భోజన, వసతి, రవాణా సౌకర్యాలు ఉంటాయని వివరించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆ రోజు ఉదయం 9.30 గంటలకు బొమ్మూరు హార్లిక్స్ ఫ్యాక్టరీ ఎదుట ఉన్న కలెక్టరేట్‌లోని వికాస కార్యాలయంలో విద్యార్హతల సర్టిఫికెట్ల జెరాక్స్‌లతో నేరుగా హాజరు కావాలని సూచించారు. వివరాలకు 7660 823 903 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.