Skip to main content

Job Mela: పాలిటెక్నిక్ క‌ళాశాల‌లో జాబ్ మేళా

నిరుద్యోగ యువ‌త‌కు ఉపాధి అవ‌కాశం క‌ల్పించేందుకు పాలిటెక్నిక్ కాలేజీలో జాబ్ మేళాను నిర్వ‌హిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అర్హులు, ఆస‌క్తి గ‌ల‌వారు ద‌ర‌ఖాస్తులు చేసుకోవాలని సూచించారు.
Job Mela for unemployed youth at Polytechnic college
Job Mela for unemployed youth at Polytechnic college

సాక్షి ఎడ్యుకేష‌న్: నియోజకవర్గ కేంద్రమైన సత్యవేడులో జరిగే జాబ్‌మేళాను మండలంలోని యువత సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ కృష్ణమూర్తి, ఏఓ గుణశేఖర్‌ తెలిపారు. సోమవారం వారు మీడియాతో మాట్లాడుతూ ఈనెల 23వ తేదీన రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సత్యవేడు పాలిటెక్నిక్‌ కళాశాలలో మెగా జాబ్‌మేళాను నిర్వహిస్తోందన్నారు.

Job Mela: నిరుద్యోగుల‌కు శ్రీ‌కాకుళంలో జాబ్ మేళా

8 నుంచి డిగ్రీ వరకు ఉత్తీర్ణులైన యువత ముందుగా 9440374535, 9154449677 నెంబర్లకు ఫోన్‌ చేసి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు. ప్రముఖ 19 కంపెనీలలో 190 ఉద్యోగాల కోసం జాబ్‌మేళా నిర్వహించనున్నట్టు తెలిపారు.

Published date : 10 Oct 2023 04:00PM

Photo Stories