Skip to main content

Job Mela: నిరుద్యోగుల‌కు శ్రీ‌కాకుళంలో జాబ్ మేళా

యువ‌తీయువ‌కుల‌కు ఉపాధి అవ‌కాశం క‌ల్పిస్తున్నామ‌ని ఉపాధి అధికారి ప్ర‌క‌టించారు. ఈ మెర‌కు ఉద్యోగానికి కావాల్సిన అర్హ‌త‌ల గురించి కూడా వివ‌రించారు..
Job mela for unemployees at srikakulam
Job mela for unemployees at srikakulam

సాక్షి ఎడ్యుకేష‌న్: జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయం ఆధ్వర్యంలో ఈనెల 11న శ్రీకాకుళం నెహ్రూ యువకేంద్రం వద్ద జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కొత్తలంక సుధ ఒక ప్రకటనలో తెలిపారు. అపోలో ఫార్మసీ, జయభేరి ఆటోమోటివ్‌ కంపెనీల్లో ఖాళీగా ఉన్న పోస్టులను అర్హులైన అభ్యర్థులతో భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. 18 నుంచి 40 ఏళ్ల వయసు కలిగి 10వ తరగతి/ఇంటర్‌/డిగ్రీ/ఫార్మసీ, ఐటీఐ/డిప్లమో మెకానికల్‌/బీ.టెక్‌ మెకానికల్‌ విద్యార్హత కలిగిన వారు అర్హులని తెలిపారు.

New Courses for Students: నాగార్జున యూనివ‌ర్సిటీలో కొత్త కోర్సులు

అపోలో ఫార్మసీకి ఎంపికైన వారు శ్రీకాకుళం, విశాఖ, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో పనిచేయాల్సి ఉంటుందని, జయభేరి ఆటోమోటివ్‌కు ఎంపికైన వారు శ్రీకాకుళం, పలాస, ఇఛ్చాపురం, రణస్థలం, పైడిభీమవరం తదితర ప్రాంతాలలో పని చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి గల యువతీ, యువకులు బుధవారం ఉదయం 10.30 గంటలకు శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలో ఉన్న నెహ్రూ యువకేంద్రం వద్దకు బయోడేటా, సర్టిఫికెట్లు, ఆధార్‌కార్డుతో హాజరుకావాలని సూచించారు.

Published date : 10 Oct 2023 03:34PM

Photo Stories