Skip to main content

APPSC Recruitment: ఏపీలో భారీ జీతంతో ప్ర‌భుత్వ ఉద్యోగాలు.. నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం.. చివరితేది ఎప్పుడంటే..?

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ) రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో జూనియర్‌ జూనియర్ లెక్చరర్ (జేఎల్) పోస్టుల భర్తీకి డిసెంబర్‌ 28న నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
 Junior Lecturer in APPSC   December 28 Announcement for Junior Lecturer Posts  APPSC JL Notification 2024   APPSC JL Recruitment Notification    Government Junior Colleges Junior Lecturer Vacancies  APPSC Degree Lecturer Recruitment 2024  Government College Lecturer Vacancies in AP

దీనిద్వారా 47 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ జనవరి 31న ప్రారంభం అవుతుంది. ఈ మేరకు ఏపీపీఎస్సీ జనవరి 30న ఒక ప్రకటన విడుదల చేసింది. అభ్యర్థుల నుంచి ఫిబ్రవరి 20 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. 

మొత్తం పోస్టుల సంఖ్య: 47

సబ్జెక్ట్‌ల వారీగా ఖాళీలు:
ఇంగ్లిష్‌-09, తెలుగు-02, ఉర్దూ-02, సంస్కృతం-02, ఒడియా-01, మ్యాథమేటిక్స్‌-01, ఫిజిక్స్‌-05, కెమిస్ట్రీ-03, బోటనీ-02, జువాలజీ-01, ఎకనామిక్స్‌-12, సివిక్స్‌-02, హిస్టరీ-05.

అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 

APPSC Degree Lecturer Recruitment 2024

వయసు: 28.12.2023 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. ఎక్స్-సర్వీస్‌మెన్/ఎన్‌సీసీ అభ్యర్థులకు వయసు ఆధారంగా 3 సంవత్సరాలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు, తాత్కాలిక ఉద్యోగులకు 3 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.  

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్, కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.

రాతపరీక్ష విధానం: మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. రాతపరీక్షలో మొత్తం రెండు పేపర్లు (పేపర్-1, పేపర్-2) ఉంటాయి. ఇందులో..
పర్-1: జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ(డిగ్రీ స్థాయి) - 150 ప్రశ్నలు- 150 మార్కులు- 150 నిమిషాలు.
పేపర్-2: అభ్యర్థికి సంబంధించిన సబ్జెక్టు (పీజీ స్థాయి) - 150 ప్రశ్నలు- 300 మార్కులు- 150 నిమిషాలు ఉంటాయి. 
పేపర్-1లో ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు, పేపర్-2లో ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు కేటాయించారు. ఇక ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కులు మైన‌స్ ఉంటుంది. 

Assistant Professors Recruitment: వైద్య ఆరోగ్య శాఖ‌లో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. పూర్తి వివ‌రాలు ఇవే..

కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్: మొత్తం 100 మార్కులకు కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. ఆఫీస్ ఆటోమేషన్, కంప్యూటర్ వినియోగం, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌లకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 60 నిమిషాలు. కనీసం అర్హత మార్కులను ఓసీలకు 40, బీసీలకు 35, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 30 మార్కులుగా నిర్ణయించారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
వేతనం: నెలకు రూ.57,100 నుంచి రూ.1,47,760.
 
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 31.01.2024.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 20.02.2024.

రాతపరీక్ష తేది: ఏప్రిల్‌/మే 2024.

వెబ్‌సైట్‌: https://psc.ap.gov.in/

RRB ALP Age Limit 2024: ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు వ‌యోప‌రిమితి పెంపు.. ఎన్ని సంవ‌త్స‌రాలు అంటే..!

Published date : 31 Jan 2024 11:51AM

Photo Stories