Assistant Professor Recruitment 2024: అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం.. అప్లికేషన్ ఫీజు ఎతంటే..?

అర్హులైన అభ్యర్థులు బ్రాడ్ స్పెషాలిటీలో ఖాళీగా ఉన్న 255 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఫిబ్రవరి 1 నుంచి 15వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం https://dme.ap.nic.in లేదా http://apmsrb.ap.gov.in/msrb వెబ్సైట్‌ను సంప్రదించండి. ఓసీలు రూ.1,000, ఎస్పీ, ఎస్టీ, బీసీ, ఈడబ్లూఎస్ అభ్యర్థులు రూ.500 చొప్పున అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు మొత్తం 424 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి జనవరి 30వ తేదీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్, లేటరల్ ఎంట్రీ ద్వారా భర్తీ చేయనున్నట్లు బోర్డు మెంబర్ సెక్రటరీ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. ‘సూపర్ స్పెషాలిటీలో 169, బ్రాడ్ స్పెషాలిటీలో 255 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశాం. వీటిలో 169 అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి ఫిబ్రవరి 6వ తేదీ ఓల్డ్ జీజీహెచ్, హనుమాన్ పేట, విజయవాడ డీఎంఈ కార్యాలయంలో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వాక్ ఇన్ రిక్రూట్మెంట్ జరగనుంద’ని ఆయన తెలిపారు.
APPSC Recruitment: ఏపీలో భారీ జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలు.. నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం..
Tags
- Assistant Professors jobs
- Medical Colleges
- Health medical department
- Assistant Professor Posts
- AP DME Assistant Professors Recruitment 2024
- Jobs
- higher education
- Faculty recruitment
- academic positions
- Teaching Positions
- Job Opportunity
- latest job notifications
- sakshi education latest job notifications