Job Opportunities: సేఫ్టీ కోర్సుతో విస్తృత ఉపాధి అవకాశాలు
మురళీనగర్ : ేసఫ్టీ కోర్సులు అభ్యసించిన వారికి పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు విస్తృతంగా ఉన్నాయని పరిశ్రమల శాఖ జాయింట్ చీఫ్ ఇన్‌స్పెక్టర్ శివ శంకర్ రెడ్డి అన్నారు. కంచరపాలెం ప్రభుత్వ కెమికల్ ఇంజినీరింగ్ కాలేజీలో నిర్వహిస్తున్న ఇండిస్ట్రియల్ సేఫ్టీ కోర్సు పూర్తి చేసిన విద్యార్థుల స్నాతకోత్సవాన్ని నగరంలోని ఓ హోటల్‌లో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేర్చుకున్న అంశాలను విధుల్లో పాటించాలన్నారు. భద్రతా కోర్సుల ప్రాధాన్యతను వివరించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ కె.వెంకటరమణ మాట్లాడుతూ కెమికల్ ఇంజినీరింగ్ కాలేజీలో ఇండస్ట్రియల్ సేఫ్టీ కోర్స్‌తోపాటు కెమికల్ సూపర్‌వైజర్ కోర్స్ ప్రారంభించామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా కోర్సు పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు అందించారు. కార్యక్రమంలో దువ్వాడ ఆర్‌ఐఎన్‌ఎల్ జీఎం రాంప్రసాద్, ఈఐపీఎల్ సీనియర్ జీఎం కేవీకే సుబ్బరాజు, హెచ్‌పీసీఎల్ ఫైర్ సేఫ్టీ విభాగం జీఎం ఎస్‌సీ పంజా, కోరమాండల్ ఇంటర్నేషనల్ ఏజీఎం నాగరాజు దేవరపల్లి, గైస్ హెచ్‌వోడీ బీవీ లక్ష్మణరావు, కోర్స్ కో ఆర్డినేటర్ వరహాలు పాల్గొన్నారు.
చదవండి: Reservation in Promotion: బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించాలి