UPSC Recruitment 2024: నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, ఎవరెవరు అప్లై ,చేసుకోవచ్చంటే..
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC), ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్((ESIC)లో 1930 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు: 1930
ఖాళీల వివరాలు
యూఆర్-892 పోస్టులు
ఈడబ్ల్యూఎస్- 193 పోస్టులు
ఓబీసీ- 446
ఎస్సీ-235
ఎస్టీ- 164
దివ్యాంగులకు-168గా పోస్టులను కేటాయించారు
అర్హతలు: బీఎస్సీ (ఆనర్స్) నర్సింగ్/ బీఎస్సీ నర్సింగ్/ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్. స్టేట్ నర్సింగ్ కౌన్సిల్‌లో నర్సు లేదా నర్సు, మిడ్‌వైఫ్‌గా రిజిస్టరై ఉండాలి. లేదా డిప్లొమా (జనరల్ నర్సింగ్ మిడ్-వైఫరీ). స్టేట్ నర్సింగ్ కౌన్సిల్‌లో నర్సు లేదా నర్సు, మిడ్‌వైఫ్‌గా రిజిస్టరై ఉండాలి. ఆసుపత్రిలో ఏడాది పని అనుభవం ఉండాలి.
వయస్సు: 27-03-2024 నాటికి రిజర్వేషన్‌ను బట్టి 40 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తులకు ప్రారంభ తేది: 07-03-2024.
దరఖాస్తులకు చివరి తేది: 27-03-2024.
పరీక్ష తేది: 07-07-2024.