Jobs in Adikavi Nannaya University: 128 అధ్యాపక పోస్టులు..
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీకి కొత్తగా 128 అధ్యాపక పోస్టులు మంజూరయ్యాయని, త్వరలోనే నోటిఫికేషన్ విడుదలవుతుందని వైస్ చాన్సలర్ ఆచార్య పద్మరాజు తెలిపారు. వర్సిటీలో శుక్రవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్సిటీలో విద్యా బోధనకు 162 మంది అధ్యాపకులు అవసరం కాగా ప్రస్తుతం 25 మంది మాత్రమే ఉన్నారన్నారు. వర్సిటీలో నూతన విద్యా విధానం అమలు చేస్తూ, నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పా రు. వర్సిటీలో కాలేజీ డెవలప్‌మెంట్ సెల్, పరీక్షల నిర్వహణలో ఆటోమేషన్ విధానాలు అమలు చేస్తున్నామని తెలిపారు. కాలేజీల నిర్వహణలో నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని, అనుబంధ కళా శాలలను ప్రతి మూడు నెలలకోసారి వర్చువల్‌గా పరిశీలిస్తున్నామన్నారు.
చదవండి: Teachers at school: చదువు చెప్పని ఉపాధ్యాయులు మాకొద్దు
రూ.25.5 కోట్లతో హాస్టల్ భవనాలు : వర్సిటీ క్యాంపస్‌లో ప్రస్తుతం రెండు బాలుర, బాలికల హాస్టళ్లు ఉన్నాయని, వీటికి అదనంగా రూ.25.5 కోట్లతో మరో రెండు హాస్టళ్లు నిర్మిస్తున్నామని ఆచార్య పద్మరాజు తెలిపారు. రూ.16.5 కోట్లతో బాలికలకు, రూ.9 కోట్లతో బాలురకు అదనపు హాస్టళ్ల నిర్మాణం జరుగుతుందని వివరించారు. వీటితో పాటు కాకినాడ, తాడేపల్లిగూడెం క్యాంపస్‌లలో కూడా అవసమైన భవన నిర్మాణాలు, మౌలిక సదుపాయాల ఏర్పాటు పనులు జరుగుతున్నాయన్నారు.
చదవండి: AP education: ఏపీ విద్యాసంస్కరణలపై తెలంగాణ ఆసక్తి
16, 17 తేదీల్లో సహస్రాబ్ది ఉత్సవాలు
వెయ్యేళ్ల చరిత్ర కలిగిన నగరాల్లో రాజమహేంద్రవరం ఒకటని, ఈ సందర్భంగా ఆదికవి నన్నయ, రాజరాజనరేంద్రుడి పేరిట ఈనెల 16, 17 తేదీల్లో కేంద్ర సాహిత్య అకాడమీ సహకారంతో సహస్రాబ్ది ఉత్సవాలను నిర్వహించనున్నామని ఆచార్య పద్మరాజు తెలిపారు.