నేడు, రేపు స్కిల్ టెస్ట్, డెమో తరగతులు
Sakshi Education

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలోని కస్తూరిబా బాలికా విద్యాలయాల్లోని ఖాళీ పోస్టుల భర్తీకి 1:3 నిష్పత్తిలో ఎంపికై న అభ్యర్థుల సర్టిఫికెట్లను గురువారం సమగ్రశిక్ష అధికారులు పరిశీలించారు. ఎంపికయిన 28 మంది అభ్యర్థులంతా విధిగా స్కిల్ టెస్ట్, మోడల్ డెమో తరగతులకు ఈ నెల 23, 24 తేదీల్లో హాజరు కావాలన్నారు. సీఆర్‌టీ పోస్టుకు ఏలూరులోని రామకోటి వద్ద ఉన్న ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో, పీజీటీ పోస్టుకు కోటదిబ్బ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యే స్కిల్ టెస్ట్, డెమో తరగతులకు అభ్యర్థులు హాజరు కావాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎన్‌వీ రవిసాగర్ తెలిపారు. హాజరుకాని అభ్యర్థుల పేర్లను తుది ఎంపిక జాబితాలో చేర్చబడవని పేర్కొన్నారు.
చదవండి: KGBV: టీచర్ పోస్టులకు ఇంటర్వ్యూలు
Published date : 23 Jun 2023 07:16PM