సాక్షి ఎడ్యుకేషన్ : స్థానిక భాస్కర్ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్‌మేళాను ఈనెల 28న నిర్వహించనున్నట్లు కళాశాల డైరెక్టర్ బొంతు శ్రీనివాసరావు తెలిపారు.
mega job mela in andhra pradesh 2023
వర్క్‌రూట్, సీప్ ఆధ్వర్యంలో భాస్కర్ డిగ్రీ కళాశాలలో ఈ జాబ్‌మేళా నిర్వహిస్తున్నారని, ఆరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మేళా జరుగుతుందని పేర్కొన్నారు. 10 కపెంనీలు ఈ జాబ్ మేళాకు హాజరు కానున్నాయని తెలిపారు.
2019వ సంవత్సరం నుంచి 2022 సంవత్సరాల మధ్యలో డిగీ పాసైన విద్యార్థులు, 2023వ సంవత్సరంలో డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ జాబ్‌మేళాలో పాల్గొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఫోన్ 8019719234, 8074231274 నంబర్లలో సంప్రదించాలని తెలియజేశారు.