Mega Job Mela: 25న ఉపాధి కార్యాలయంలో మెగా జాబ్‌మేళా
కంచరపాలెం (విశాఖ): స్థానిక జిల్లా ఉపాధి కార్యాలయం నేషనల్ కెరీర్ సర్వీస్ సెంటర్‌లో ఈ నెల 25న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఎంప్లాయీమెంట్ అధికారులు సీహెచ్ సుబ్బిరెడ్డి (క్లరికల్), కె.శాంతి (టెక్నికల్) తెలిపారు. రక్షిత డ్రగ్స్, ఏడీఎల్ ఆగ్రో ఫార్మా, ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చర్స్, రక్షిత్ ఫార్మాసూటికల్, టీం లీజ్ యూనియన్ బ్యాంక్, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలో 282 ఉద్యోగ ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ప్రొడక్షన్ ఆపరేటర్, కెమిస్ట్, ప్రాసెస్ డెవలప్‌మెంట్ ల్యాబ్ కెమిస్ట్, ఫిట్టర్స్, కస్టమర్, అండ్ ఫీల్డ్ ట్రైనీ, సేల్స్ డెవలప్‌మెంట్ మేనేజర్, ఫార్మాసిస్ట్, అకౌంటెంట్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్, హార్టీకల్చర్ ఫీల్డ్ ఆఫీసర్, మెకానిక్స్, టెలికాలర్స్, టీం లీడర్స్, అసిస్టెంట్ సేల్స్ మేనేజర్, కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలకు ఎస్‌ఎస్‌సీ, ఇంటర్, ఐటీఐ, డిప్లమో, ఏదైనా డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత సాధించి 18–35 ఏళ్లు కల్గిన అభ్యర్థులు అర్హులన్నారు. జీతం నెలకు రూ.12 వేలనుంచి రూ.25 వేల వరకు ఉంటుందన్నారు. ncs.gov.inలో అభ్యర్థుల పేర్లు రిజిస్టర్ చేసుకోవాలని కోరారు.