Skip to main content

Email Goes Viral: ఇంటర్వ్యూకి వ‌చ్చిన అభ్య‌ర్ధికి చుక్క‌లు చూపించిన ఐటీ కంపెనీ.. కార‌ణం ఏమిటంటే..!

కోరుకున్న ఐటీ జాబ్‌.. కోరుకున్నంత జీతం దక్కుతుందంటే ఎవరైనా ఏం చేస్తారు..? ప్రయత్నిస్తారు.. ప్రయత్నిస్తునే ఉండి అనుకున్నది సాధిస్తారు.
Navigating Job Market Struggles IT  Success Amidst IT Job Challenges   Company's Rude Rejection Email Goes Viral   Persistence in IT Job Hunt

ఈ ప్రాసెస్‌లో లెక్కలేనని రిజెక్షన్‌లు ఎదరవుతుంటాయి. అని తెలిసినా ఆ జాబ్‌ కోసం ప్రయత్నిస్తూనే ఉంటాం. అలా ఐటీ జాబ్‌ కోసం ప్రయత్నించిన ఓ ఉద్యోగికి చుక్కెదురైంది. 

ఓ అభ్యర్ధి పేరున్న సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో జాబ్‌ కోసం అప్లయ్‌ చేశాడు. ఇంటర్వ్యూకి వెళ్లాడు. కానీ అక్కడ ఇంటర్వ్యూలో రాణించలేకపోయాడు. ఈ విషయాన్ని సదరు కంపెనీ యాజమన్యం మెయిల్ ద్వారా ఆ అభ్యర్ధికి సమాచారం అందిచింది. ఆ మెయిల్‌లో ‘మేం నిర్వహించిన ఇంటర్వ్యూలో మీరు ఫెయిల్‌ అయ్యారు’ అని ఉంది. అంత వరకు బాగానే ఉంది. కానీ ‘ఇంకోసారి నువ్వు మా కంపెనీలో జాబ్‌ కావాలని అప్లయ్‌ చేశావనుకో ఊరుకునేది లేదు. ఏడాది వరకు ఇంటర్వ్యూ అటెండ్‌ కాకుండా బ్లాక్‌ చేస్తాం’ అని మెయిల్‌ పెట్టింది. 

ఆ మెయిల్‌ ఎందుకు అలా పెట్టిందనే అంశంపై స్పష్టత రానప్పటికీ ప్రస్తుతం ఈ అంశం ఐటీ కంపెనీల పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. ఐటీ కంపెనీ ఈ తరహా మెయిల్స్‌ పంపడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారిలో చాలా మంది ఐటీ కంపెనీల పరిస్థితిపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. 

IT Job

మీకు మేం ఉద్యోగం ఇవ్వలేం..
అమెరికా కేంద్రంగా ఎలైట్ సాఫ్ట్‌వేర్ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఆ కంపెనీలో ఫ్రంటెండ్ డెవలప్‌ జాబ్‌ కోసం ఓ అభ్యర్ధి అప్లయ్‌ చేశాడు. అందుకు మా కంపెనీలో జాబ్‌ కోసం అప్లయ్‌ చేసినందుకు అభ్యర్థికి కృతజ్ఞతలు ఈమెయిల్‌ పంపింది. అందులో ఆటోమేటెడ్ ఆన్‌లైన్ పరీక్షను క్లియర్ చేయడంలో విఫలమైనందున జాబ్‌ ఇవ్వలేమని తెలిపింది.  

Google Meet Call: ఊడిన‌ ఉద్యోగాలు.. రెండు నిమిషాల్లో 200 మందికి గుడ్‌బై చెప్పిన కంపెనీ..!

జాబ్‌ కోసం అప్లయ్ చేయ‌వ‌ద్దు..
ఇంతవరకు అంతా బాగనే ఉంది. ‘కనీసం వచ్చే ఏడాది చివరి వరకు మళ్లీ జాబ్‌ కోసం అప్లయ్‌ చేయొద్దని హెచ్చరించింది. ఈ సమయాని కంటే ముందే మళ్లీ ఈ స్థానానికి దరఖాస్తు చేయడానికి మీరు ప్రయత్నిస్తే, ఇంటర్వ్యూ కాల్‌ వస్తే మీ రెస్యూమ్‌ ఆటోమెటిక్‌గా బ్లాక్‌ అవుతుంది. భవిష్యత్‌లో మా కంపెనీలో ఇతర ఉద్యోగాలకు అప్లయ్‌ చేసుకునే వెసులు బాటు కూడా ఉండదు’ అని ఈమెయిల్‌లో పేర్కొంది.

మమ్మల్ని నిందించడం మానేసి..
పైగా ఆన్‌లైన్ ఆటోమెషిన్‌ పంపే మెయిల్స్‌ వల్ల అభ్యర్ధులు ఇబ్బంది పడుతుంటే.. పరిష్కారం చూడాల్సిన‌ కంపెనీ.. జాబ్‌ రాలేదని, లేదంటే బ్లాక్‌ చేసిందని కంపెనీని నిందించడం మానేసి తమను తాము మెరుగుపరుచుకోవాలని సూచించింది. 

ఉద్యోగులతో ఎలా వ్యవహరిస్తుందో..
దీనిపై నెటిజన్‌లు పలు విధాలు స్పందిస్తున్నారు. ఈ సాకుతోనైనా ఆ కంపెనీలో జాబ్‌ కోసం ప్రయత్నిస్తా అని ఒకరు అంటుంటే.. ‘ఇంటర్వ్యూ అభ్యర్ధులతో ఇలా ప్రవర్తిస్తే.. వారి ఉద్యోగులతో ఎలా వ్యవహరిస్తుందో’ ఊహించుకోండి అని మరొకరు కామెంట్‌ చేశారు.

 

IIT Placement 2024: రూ.కోటి కంటే ఎక్కువ జీతం.. 85 మంది సెలెక్ట్‌.. ఈ జాబ్స్ ఎక్క‌డంటే..!

Published date : 08 Jan 2024 09:17AM

Photo Stories