Skip to main content

Jobs : సంక్షేమ శాఖ పోస్టుల భర్తీలో గందరగోళం

the recruitment of welfare department posts

సాక్షి, వరంగల్‌/కాళోజీ సెంటర్‌: జిల్లా సంక్షేమ శాఖలో చేపట్టిన ఉద్యోగ నియామకాల్లో అర్హులకు అన్యాయం జరుగుతుందన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అకడమిక్‌ మార్కుల్లో మంచి స్కోరు సాధించిన అభ్యర్థులకు అనుభవం, ఇంటర్వ్యూ వచ్చేసరికి తక్కువ మార్కులు రావడంతో ఈ నియామకాలపై గందరగోళం నెలకొంది. ఇంతకీ విషయమేంటంటే కొత్త మిషన్‌ శక్తి పథకం కింద డిస్ట్రిక్ట్‌ హబ్‌ ఫర్‌ ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ ఉమెన్‌కు సంబంధించి కాంట్రాక్ట్‌ బేసిస్‌కు చెందిన నాలుగు ఉద్యోగాల నియామకాలు ఇటీవల చేపట్టారు. జిల్లా మిషన్‌ కోఆర్డినేటర్‌, టెండర్‌ స్పెషలిస్ట్‌, స్పెషలిస్ట్‌ ఇన్‌ ఫైనాన్షియల్‌ లిటరసీ, ఎంటీఎస్‌ పోస్టులకు 199 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో రెండు పోస్టులకు అర్హులను ఎంపిక చేయగా.. మరో రెండు పోస్టుల్లో మాత్రం విచిత్ర పరిస్థితి నెలకొందన్న వాదన బలంగా ఉంది. ఎందుకంటే ఈ పోస్టులకు ఎంపికై న ఇద్దరిలో ఒకరు అంగన్‌వాడీ టీచర్‌ కోడలు కాగా, ఇంకొకరు జిల్లా బాలల సంరక్షణ విభాగంలో పనిచేస్తున్న అకౌంటెంట్‌ భార్య ఉండడం అనుమానాలకు తావిస్తోంది. వీరికి అకడమిక్‌లో తక్కువ మార్కులున్నా .. అనుభవం, ఇంటర్వ్యూలో ఇష్టారీతిన మార్కులేయడం విమర్శలకు అస్కారమిచ్చినట్లయ్యింది. టెండర్‌ స్పెషలిస్ట్‌ పోస్టు దక్కించుకున్న యువతికి అకడమిక్‌ మార్కులు 38.84 ఉండగా.. అనుభవంలో 30, ఇంటర్వ్యూలో 7.75 మార్కులు వచ్చాయి. ఈమె తర్వాత స్థానంలో ఉన్న యువతికి అకడమిక్‌ మార్కులు 48.90 ఉండగా.. అనుభవంలో 23, ఇంటర్వ్యూలో సున్నా మార్కులు రావడం గమనార్హం. ఇక స్పెషలిస్ట్‌ ఇన్‌ ఫైనాన్షియల్‌ లిటరసీ పోస్టు దక్కించుకున్న యువతికి అకడమిక్‌ మార్కులు 40.41 ఉండగా.. అనుభవం 29 మార్కులు, ఇంటర్వ్యూ ఏడు మార్కులు వచ్చాయి. ఈమె తర్వాతి స్థానంలో ఉన్న యువతికి అకడమిక్‌ మార్కులు 45.12 ఉంటే అనుభవం 25 మార్కులు, ఇంటర్వ్యూ ఏడు మార్కులు వచ్చాయి. ఈమెతోపాటు మరో ముగ్గురికి పోస్టు దక్కించుకున్న యువతి కన్నా అకడమిక్‌ మార్కులు ఎక్కువగా ఉండడం అనుమానాలకు తావిస్తోంది. ఇంకో విషయమేంటంటే వారు పనిచేసిన సంస్థల్లో నిజంగా పనిచేశారా లేదా అని తెలుసుకోకుండానే ఈ నియామకాలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి.

Teacher Jobs: ఏకలవ్య పాఠశాలలో టీచర్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం!

సంక్షేమ శాఖ పోస్టుల భర్తీలో గందరగోళం
అనుభవం, ఇంటర్వ్యూ మార్కుల్లో భారీ తేడా రెండింట్లో ఓకే ఉన్నా.. మరో రెండింట్లో దారుణం ఒకరు అంగన్‌వాడీ టీచర్‌ కోడలు కావడంతో ప్రాధాన్యం ఇంకొకరు అదే విభాగంలోని అకౌంటెంట్‌ భార్య.. అనుభవ సర్టిఫికెట్లు లోతుగా పరిశీలిస్తే వెలుగుచూడనున్న అక్రమాలు కలెక్టర్‌ అధ్యక్షతన కమిటీని తప్పుదారి పట్టించారన్న విమర్శలు

ఆ ఇద్దరు చెప్పిందే ఫైనలట..
జిల్లా సంక్షేమ విభాగ ప్రధాన కార్యాలయంలో ఉండే ఓ వ్యక్తితోపాటు జిల్లా బాలల సంరక్షణ విభాగంలో పనిచేసే ఓ అధికారి ఉద్యోగాల నియామకాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారన్న విమర్శలున్నాయి. మేం ఏది చెబితే అదే ఫైనల్‌.. వారికే ఉద్యోగాలు వస్తాయని వారు బల్లగుద్దీ మరీ చెబుతుండడం గమనార్హం. ఇప్పటికే డిస్ట్రిక్ట్‌ హబ్‌ ఫర్‌ ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ ఉమెన్‌లో ఓ పోస్టును తానే ఇప్పించానని చెబుతున్న ఓ అధికారి.. ఇప్పుడూ చైల్డ్‌లైన్‌లోనూ తమవారికే పోస్టులు వస్తాయని చెబుతుండడంతో ఉద్యోగ నియామకాల్లో అవకతవకలకు ఆస్కారం ఉందనే విమర్శలకు అవకాశమిస్తోంది. ఇప్పటికే చైల్డ్‌లైన్‌లో పనిచేస్తున్న ప్రస్తుత సిబ్బందికి అవకాశమిచ్చాకే.. కొత్తవాళ్లలో అర్హులకు ఇవ్వాలని ప్రభుత్వం నుంచి నిబంధనలు ఉన్నా అవన్నీ పట్టించుకోవడం లేదు. ఎంతటి ప్రతిభ ఉన్నావారి నైనా పక్కన పెట్టేస్తామని చెబుతుండడంతో అక్రమాలు జరిగే అవకాశ ముందని చర్చ జరుగుతోంది. అయితే, కలెక్టర్‌ అధ్యక్షతన ఐదుగురు సభ్యులతో కమిటీ ఈ అభ్యర్థులను ఖరారు చేసిందని చెబుతున్నా.. కమిటీని తప్పుదారి పట్టించారన్న ఆరోపణలున్నాయి. ఈ నియామకాలపై ఎవరికై నా అభ్యంతరాలుంటే కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తే ఆమె ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని జిల్లా సంక్షేమ విభాగాధికారి శారద వివరణ ఇచ్చారు.

Best Teacher Awards: ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు దరఖాస్తుకు రేపే చివరి తేదీ!

Published date : 14 Jul 2023 06:29PM

Photo Stories