Skip to main content

Foreign Education in Canada: ఫేక్‌ ఆఫర్‌ లెటర్లు... కెన‌డాలో ల‌బోదిబోమంటున్న‌ భారతీయ విద్యార్థులు... అస‌లు ఏం జ‌రిగిందంటే..!

ఉన్నత విద్యను అభ్యసించేందుకు భారత్‌ నుంచి విదేశాలకు వెళ్తోన్న వారి సంఖ్య ప్రతిఏటా పెరుగుతోన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాతో పాటు యూరప్‌ దేశాలకూ భారతీయ విద్యార్థులు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో కెనడా విద్యా సంస్థల్లో అడ్మిషన్‌ కోసం ఇచ్చిన ఆఫర్‌ లెటర్లలో కొన్ని తప్పుడువి ఉన్నట్లు అక్కడి అధికారులు గుర్తించారు.
Canada
Canada

దీంతో ఆ విద్యార్థులకు కెనడియన్‌ బార్డర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ (CBSA) డిపార్టేషన్‌ లెటర్లు కూడా అందించినట్లు సమాచారం. ఇలా సుమారు 700 మంది భారతీయ విద్యార్థులు కెనడా నుంచి బహిష్కరణ గండాన్ని ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.

Ambati Rayudu meets YS Jagan: సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన అంబటి​ రాయుడు

ఆందోళన చేస్తున్నవారిలో ఒక విద్యార్థి చెప్పిన కథనం ప్రకారం... 2018లో కెనడాలో చదువుకోవాలన్న తపనతో మేమంతా ఏజెంట్ల ద్వారా దరఖాస్తు చేసుకోగా ఇక్కడ టాప్ యూనివర్సిటీలో సీట్లున్నాయని చెప్పి మాకు ఆఫర్ లెటర్లు పంపించారు.

canada

మాలో చాలామంది ఇక్కడికి రావడానికి ఉన్న ఆస్తులను తాకట్టు పెట్టుకుని, కొంత‌మంది అమ్ముకుని వచ్చాము. తీరా వచ్చాక మాకు సీటు వచ్చిన యూనివర్సిటీల్లో సీట్లన్నీ అయిపోయాయని మరో యూనివర్సిటీలో చేరతారా అని ఏజెంట్లు అడిగారు. 

Top 10 medical colleges: టాప్ టెన్ మెడిక‌ల్ కాలేజీలు ఇవే... ఇక్క‌డ సీటు వ‌స్తే సెటిలైన‌ట్లే..!

ఎదురు చూస్తూ కూర్చుంటే ఏడాది వృధా అయిపోతుందని, ఎలాగోలా చదువుకోవాలన్న ఆలోచనతో వేరే యూనివర్సిటీ అయినా పర్వాలేదన్నాము. ఆ యూనివర్సిటీల్లో చేరేందుకు మాకు ఇచ్చిన లెటర్లు ఫేక్ వని మాకు తెలియదు. అయినా కూడా హ్యాపీగా చదువుకున్నాం. కొంతమందికి మంచి ఉద్యోగాలు కూడా వచ్చాయి.

canada

తీరా ఇప్పుడు పర్మనెంట్ రెసిడెంట్ కోసం దరఖాస్తు చేసుకోగా మావన్నీ ఫేక్  ఆఫర్ లెటర్లంటూ మాపై వేటు చేశారు. ఈ పరిస్థితుల్లో మమ్మల్ని భారత ప్రభుత్వ పెద్దలు ఆదుకోకుంటే ఆత్మహత్య చేసుకోవడం తప్ప మాకు మరో మార్గం లేదని అంటున్నారు. 

చ‌ద‌వండి: విదేశాల్లో ఎంబీబీఎస్ చేయాల‌నుకుంటున్నారా... అయితే వీటి గురించి తెలుసుకుని వెళ్లండి...!

ఈ మేరకు పంజాబ్ మంత్రి కుల్దీప్ సింగ్ ధాలీవాల్ కెనడా విద్యార్థుల భవిష్యత్తు నాశనం కాకుండా చూడమని అభ్యర్థిస్తూ కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌కు లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. భారత విదేశాంగ శాఖ కూడా కెనడా ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తోంది. కెనడా ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తున్నట్లు స‌మాచారం.

Published date : 08 Jun 2023 06:17PM

Photo Stories