Top 10 medical colleges: టాప్ టెన్ మెడికల్ కాలేజీలు ఇవే... ఇక్కడ సీటు వస్తే సెటిలైనట్లే..!
ఉత్తమ కాలేజీల్లో విద్యనభ్యసించినప్పుడే కెరియర్ దూసుకుపోతుంది. ఈ ఏడాది టాప్ కాలేజీల జాబితాను కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి రాజ్ కుమార్ రంజన్ సింగ్ తెలిపారు. ఇందులో టాప్ 10 కాలేజీల పేర్లేంటో ఇక్కడ తెలుసుకుందాం..!
ఎన్ఐఆర్ఎఫ్ అధికారిక వెబ్‌సైట్‌లోనూ మీకు కాలేజీల జాబితా అందుబాటులో ఉంటుంది. మెడికల్ కేటగిరీలోనే కాకుండా టాప్ కాలేజీలు, యూనివర్సిటీలు, రీసెర్చ్ ఇన్ స్టిట్యూషన్స్, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, ఫార్మసీ, లా, మెడికల్, ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, డెంటల్, అగ్రికల్చర్ అనుబంధ రంగాల కళాశాలల లిస్ట్ కూడా మీరు చూడొచ్చు.
ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 2023: దేశంలో టాప్ 10 మెడికల్ కాలేజీలు
1: ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)
దేశంలో అత్యున్నత విద్యాసంస్థ ఇది. ఇందులో చదువుకోవడానికి ఏడాదికి కేవలం వెయ్యి నుంచి రూ.3 వేల ఫీజు మాత్రమే అవుతుంది. నీట్ కట్ ఆఫ్ ర్యాంకును బట్టి చూస్తే 53 నుంచి 2090 మధ్య వచ్చిన వారికి ఇందులో సీటు లభించే అవకాశం ఉంది. సీటు రిజర్వేషన్ల ఆధారంగా కేటాయిస్తారు.
ప్రదేశం: న్యూఢిల్లీ, ఢిల్లీ
2: పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్
మెడికల్ కళాశాలలో జాబితాలో ఇది రెండో స్థానంలో ఉంది.
లొకేషన్: చండీగఢ్
3: క్రిస్టియన్ మెడికల్ కాలేజ్
ఏడాదికి విద్యార్థికి రూ.40 వేల నుంచి 50 వేల మధ్య అవుతుంది. నీట్ ర్యాంకు 159 నుంచి 5425 మధ్య వచ్చిన వారికి సీటు లభిస్తుంది.
ప్రదేశం: వెల్లూరు, తమిళనాడు
4: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్
లొకేషన్: బెంగళూరు, కర్ణాటక
5: జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్
ప్రదేశం: పాండిచ్చేరి
6: అమృత విశ్వ విద్యాపీఠం
లొకేషన్: కోయంబత్తూరు, తమిళనాడు
7: సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్
స్థలం: లక్నో, ఉత్తరప్రదేశ్
8: బెనారస్ హిందూ యూనివర్సిటీ
ఏడాదికి విద్యార్థికి రూ.13 వేల నుంచి 15 వేల మధ్య అవుతుంది. నీట్ ర్యాంకు 479 నుంచి 669 మధ్య వచ్చిన వారికి సీటు లభిస్తుంది.
ప్రదేశం: వారణాసి, ఉత్తర ప్రదేశ్
9: కస్తూర్బా మెడికల్ కాలేజ్, మణిపాల్
ఏడాదికి విద్యార్థికి రూ.15 లక్షల నుంచి 20 లక్షల మధ్య అవుతుంది. నీట్ ర్యాంకు 217 నుంచి 63448 మధ్య వచ్చిన వారికి సీటు లభిస్తుంది.
స్థలం: మణిపాల్, కర్ణాటక
10: శ్రీ చిత్ర తిరునాళ్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ
స్థలం: తిరువనంతపురం, కేరళ
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్