1,748 మంది ఎస్జీటీల బదిలీలు
పెడన: ఉమ్మడి కృష్ణా జిల్లాలో విద్యాశాఖ చేపట్టిన ఉపాధ్యాయుల సాధారణ బదిలీల ప్రక్రియలో.. సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల బదిలీలు ఆదివారం వెల్లడయ్యాయి. బదిలీ అయిన 1,748 మంది ఎస్జీటీల పేర్లను వెబ్‌సైట్‌లో ఉంచారు. పేర్లు పరిశీలించుకుని వారి ఉత్తర్వు కాపీలను డౌన్ లోడ్ చేసుకుని ఏ పాఠశాల అయితే కేటాయించారో అక్కడ చేరాలని విద్యాశాఖాధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే గ్రేడ్–2 హెచ్‌ఎంలు 217 మంది, స్కూలు అసిస్టెంట్లు 1,976 మంది ఆన్‌లైన్ ద్వారా బదిలీ అయిన విషయం విదితమే. క్రాఫ్ట్, డ్రాయింగ్, మ్యూజిక్‌లకు సంబంధించిన 18 మంది బదిలీ అయ్యారు. ఎస్జీటీల బదిలీల జాబితాలను వెల్లడించడంతో 98 శాతం ఉపాధ్యాయుల ప్రక్రియ పూర్తయినట్లేనని సంఘ నాయకులు పేర్కొంటున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 1,748 మంది ఎస్జీటీలు ఉన్నారు. 1546 మంది తప్పనిసరిగా బదిలీ అయిన వారున్నారు. రిక్వెస్టు కోరిన సెకండరీ గ్రేడ్ టీచర్లు 202 మంది ఉన్నారు. ఆది, సోమవారాల్లో బదిలీ అయిన పాఠశాలల్లో విధుల్లో చేరతారని నోడల్ అధికారి, డీఈఓ తాహెరాసుల్తానా తెలిపారు.