Skip to main content

JEE MAIN 2022: సెకండ్‌ సెషన్‌ పరీక్ష తేదీ ఇదే..

ఐఐటీ, ఎన్‌ఐటీ తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశాలకు సంబంధించిన Joint Entrance Examination (Main)–2022 రెండో సెషన్‌ పరీక్షలు జూలై 25 నుంచి ప్రారంభం కానున్నాయి.
JEE MAIN 2022
జేఈఈ మెయిన్ సెకండ్‌ సెషన్‌ పరీక్ష తేదీ ఇదే..

ఈ మేరకు National Testing Agency(NTA) జూలై 20న ప్రకటన జారీ చేసింది. తొలుత ఈ పరీక్షలను జూలై 21వ తేదీ నుంచి జూలై 30 వరకు నిర్వహించాలని ఎన్‌టీఏ షెడ్యూల్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే వరుస పరీక్షల నేపథ్యంలో నాలుగు రోజుల పాటు వాయిదా వేసింది. కంప్యూటర్‌ ఆధారితంగా Central University Entrance Test (CUET) పరీక్షలు జూలై 20 వరకు కొనసాగుతుండటం, ఆ మరునాటి నుంచే జేఈఈ మెయిన్‌ నిర్వహణకు సమయం సరిపడా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. జేఈఈ మెయిన్‌ రెండో విడత పరీక్షలకు 6,29,778 మంది విద్యార్థులు రిజిస్టర్‌ చేసుకున్నారు. అడ్మిట్‌ కార్డులు గురువారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. ‘https://jeemain.nta.nic.in’ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. JEE MAIN–2022 తొలి సెషన్‌ పరీక్షలు జూన్‌ 23 నుంచి 29 వరకు జరిగిన సంగతి తెలిసిందే. 

చదవండి: 

Published date : 21 Jul 2022 01:15PM

Photo Stories