Skip to main content

జేఈఈలో ఎస్సీ గురుకుల విద్యార్థుల సత్తా చాటారు

సాక్షి, అమరావతి/ సాక్షి, విశాఖపట్నం : జేఈఈ తొలివిడత పరీక్షల్లో ఎస్సీ గురుకులాలకు చెందిన విద్యార్థులు కార్పొరేట్‌ విద్యా సంస్థలకు దీటుగా సత్తా చాటారని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు.
JEE the ability of AP SC Gurukula students was shown
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున

ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన ఫిబ్రవరి 9న మీడియాకు వెల్లడించారు. ఎస్సీ గురుకులాలకు చెందిన 189 మంది విద్యార్థులు జేఈఈ పరీక్షలు రాశారని, వారిలో 151 మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు అర్హత సాధించినట్టు తెలిపారు. రాష్ట్రంలోని ఎస్సీ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో చిన్నటేకూరు(కర్నూలు జిల్లా), అడవి తక్కెళ్లపాడు(గుంటూరు జిల్లా), ఈడ్పుగల్లు(కృష్ణా జిల్లా)లో జేఈఈ, నీట్‌ శిక్షణ కేంద్రాలను నిర్వహించినట్టు తెలిపారు. ప్రత్యేక శ్రద్ధతో ఇచి్చన శిక్షణతో జేఈఈ తొలి విడత పరీక్షల్లో అనేక మంది ఎస్సీ విద్యార్థులు వివిధ సబ్జెక్టుల్లో 99.05 పర్సంటైల్‌ వరకూ మార్కులు సాధించినట్టు చెప్పారు.

చదవండి: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ - గైడెన్స్ | న్యూస్ | వీడియోస్

అన్ని సబ్జెక్టుల్లోనూ ఓవరాల్‌గా చిన్నటేకూరు శిక్షణ కేంద్రానికి చెందిన వరదా పవన్‌కుమార్‌ 96.61, మల్లెపోగు అవన్‌కుమార్‌ 95.49, రవణ కిరణ్‌కుమార్‌ 95.39 పర్సంటైల్‌ను సాధించగా, ఈడ్పుగల్లుకు చెందిన జి.మనోజ్ఞ 95.60, అడవి తక్కెళ్లపాడుకు చెందిన అజయ్‌భార్గవ్‌ 93.63 పర్సంటైల్స్‌ సాధించి ఎస్సీ గురుకులాల్లో టాపర్స్‌గా నిలిచారని వివరించారు. ఎన్‌ఐటీలలో సీట్లు సాధించడానికి అంచనా వేస్తున్న కటాఫ్‌ మార్కుల ప్రకారంగా తమ గురుకులాల నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలకు అర్హత సాధించిన 151 మంది విద్యార్థుల్లో 93 మందికి ప్రస్తుతం సాధించిన మార్కులతోనే సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నామని తెలిపారు. గురుకుల విద్యార్థులు ఎస్సీ రిజర్వేషన్‌ విభాగం నుంచి కాకుండా తమ ప్రతిభతో జనరల్‌ కేటగిరీలోనే సీట్లు పొందేందుకు అవసరమైన శిక్షణ ఇస్తామన్నారు. 

చదవండి: రైతు బిడ్డ సంతోష్‌రెడ్డికి ఆలిండియా 4వ ర్యాంక్‌..నా కోరిక ఇదే..

బీసీ గురుకుల విద్యార్థుల ప్రతిభ 

జేఈఈ తొలి విడత పరీక్షల్లో బీసీ సంక్షేమ గురుకుల విద్యార్థులు 168 మంది బీసీ గురుకుల విద్యార్థులు హాజరుకాగా 35 మంది జేఈఈ అడ్వాన్స్‌ పరీక్షలకు అర్హత సాధించారని మహాత్మ జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణమోహన్‌ తెలిపారు.

చదవండి: తెలంగాణ‌లో అత్యుత్తమ ర్యాంక్‌లతో సత్తాచాటిన విద్యార్థులు వీరే..

సత్తా చాటిన గిరిజన విద్యార్థులు 

జేఈఈ మెయిన్‌లో గిరిజన విద్యార్థులు సత్తాచాటారు. విశాఖ మారికవలస ఏపీటీడబ్ల్యూఆర్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో శిక్షణ పొందుతున్న విద్యార్థుల్లో 18 మంది అడ్వాన్స్‌డ్‌ పరీక్షలకు అర్హత సాధించారు. రాహుల్‌ అత్యధికంగా 85.5 శాతం మార్కులు సాధించాడు. 

చదవండి: AP CM YS Jagan : ఎస్సీ, ఎస్టీ గురుకులాల ఐఐటీ ర్యాంకర్లకు అభినందనలు..మీకు ఏం కావాలన్నా..

Published date : 10 Feb 2023 03:31PM

Photo Stories