Jee Advanced: గురుకుల విద్యార్థులు ప్రతిభ కనబర్చారు
తెలంగాణ గిరిజన గురుకుల విద్యా సంస్థల సొసైటీ నుంచి 400 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 96 మంది ఐఐటీల్లో సీట్లు సాధించే స్థాయిలో ర్యాంకులు సాధించారు. మరో 118 మంది విద్యార్థులకూ మంచి మార్కులు వచ్చాయి. గతేడాది 105 మంది విద్యా ర్థులు పలు ఐఐటీల్లో అడ్మిషన్లు పొందారని గిరిజన గురుకుల సొసైటీ ప్రకటించింది.
చదవండి: JEE Advanced: సత్తా చూపిన తెలుగు విద్యార్థులు.. టాప్ 10 ర్యాంకర్లు వీరే..
గౌలిదొడ్డి గురుకులం నుంచి 35 మంది
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలలో హైదరాబాద్‌లోని గౌలిదొడ్డి్డతెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకులం విద్యార్థి సాత్విక్ జాతీయ స్థాయిలో ఎస్సీ కేటగిరీలో 53వ ర్యాంకు సాధించాడు. ఈ గురుకులం నుంచి 35 మందికి ఐఐటీ సీట్లు సాధించగల ర్యాంకులు వచ్చాయని ప్రిన్సిపాల్ పాపారావు తెలిపారు.
ర్యాంకర్‌గా కారు డ్రైవర్ కుమారుడు
జాతీయస్థాయిలో ఎస్సీ కేటగిరీలో 53వ ర్యాంకు సాధించిన బైండ్ల సాత్విక్.. కామారెడ్డి జిల్లాకు చెందిన కారు డ్రైవర్ సురేందర్, రేణుక దంపతుల కుమారుడు. జాతీయ స్థాయిలో ర్యాంకు సాధించడం సంతోషంగా ఉందని, తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రో త్సాహమే దీనికి కారణమని సాత్విక్ తెలిపాడు.
చదవండి: NIRF: దేశంలో నంబర్ 1 ఐఐటీ ఇదే.. ఎన్‌ఐఆర్‌ఎఫ్–2023 ర్యాంకింగ్ నివేదిక విడుదల..
టిఫిన్ సెంటర్ నడిపే తల్లిదండ్రుల ప్రోత్సాహంతో..
గౌలిదొడ్డి గురుకులం విద్యార్థి పృథ్వీరాజ్ ఎస్టీ కేటగిరీలో జాతీయ స్థాయిలో 225వ ర్యాంకు సాధించాడు. తన తల్లిదండ్రులు నర్యా, సుగుణ టిఫిన్ సెంటర్ నడుపుతూ తనను చదివిస్తున్నారని.. మంచి ర్యాంకు సాధించడంతో వారి కల నెరవేరినట్లు అయిందని పృథ్వీరాజ్ చెప్పాడు. ఐఐటీలో సీట్లు రావడానికి గురుకులాల్లోని విద్య
తోడ్పడుతోందని పేర్కొన్నాడు.