యథావిధిగా ఇంటర్ ప్రాక్టికల్స్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు యథావిధిగా జరుగుతాయని తెలంగాణ బోర్డు వర్గాలు ఫిబ్రవరి 1నస్పష్టం చేశాయి.
మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా ఎలాంటి సెలవు ఇవ్వటం లేదని పేర్కొన్నాయి. అనివార్య కారణాల వల్ల ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకాని వారు ఫిబ్రవరి 21 లోగా పరీక్షలకు హాజరుకావచ్చని వెల్లడించాయి.
మొదలైన ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు
రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 1నఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొత్తం 547 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలకు 46,505 మంది హాజరయ్యారు. మొదటి రోజు పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని, పరీక్షలు ఫిబ్రవరి 21 వరకు కొనసాగుతాయని బోర్డు వెల్లడించింది.

Published date : 02 Feb 2018 04:45PM