విద్యార్థులకు ఇంటర్ మెమోలు ఇవ్వండి
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని అన్ని జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లు విద్యార్థులకు పాస్ సర్టిఫికెట్‌లు (లాంగ్ మెమో) అందించాలని ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు పరీక్షల నియంత్రణ అధికారి ఆగస్టు 16న ఓ ప్రకటనలో తెలిపారు.
మార్చి 2018 ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు, జూన్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన సర్టిఫికెట్లను జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు, నోడల్ ఆఫీసర్ల నుంచి ఆగస్టు 20 లోగా తీసుకోవాలని ప్రిన్సిపాళ్లకు సూచించారు.
Published date : 17 Aug 2018 05:11PM