Skip to main content

విద్యార్థినుల ఉన్నత విద్యకు విజ్ఞాన్ జ్యోతి

న్యూఢిల్లీ: తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ చదువుతున్న విద్యార్థినులకు కేంద్ర శాస్త్రసాంకేతిక మంత్రిత్వశాఖ ‘విజ్ఞాన్ జ్యోతి’పేరుతో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయనుంది.
  ఉన్నత విద్యలో చేరే విద్యార్థినులు.. ఇంజనీరింగ్, గణితం, భౌతిక శాస్త్రాల వైపు ఆకర్షితులయ్యేలా చేయడమే ఈ పథకం ఉద్దేశం. విజ్ఞాన్ జ్యోతి కార్యక్రమం కింద దేశ వ్యాప్తంగా 50,000 మంది విద్యార్థినులకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని అధికారులు తెలిపారు. ఈ విజ్ఞాన జ్యోతి కార్యక్రమానికి ఐఐటీలు, ఐఐఎస్‌ఈఆర్, విశ్వవిద్యాలయాలు మద్దతుని స్తున్నాయి. ఈ కార్యక్రమంతో ఇంటర్ విద్యార్థినులు ఎక్కువగా లబ్ధి పొందుతారు.
Published date : 18 Sep 2019 04:12PM

Photo Stories