వెబ్‌సైట్‌లో టీఎస్ ఇంటర్ హాల్‌టికెట్లు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మార్చి 4 నుంచి 18 వరకు జరగనున్న ఇంటర్మీడియెట్ పరీక్షల కోసం విద్యార్థుల హాల్‌టికెట్లు ఇంటర్ బోర్డ్ తమ వెబ్‌సైట్ https:// tsbie. cgg. gov. inలో అందుబాటు లోకి తెచ్చింది.
అలాగే విద్యార్థులు తమ పరీక్ష కేంద్రాల వివరాలు తెలుసుకునేందుకు వీలుగా ‘టీఎస్‌బీఐఈ ఎం-సర్వీసెస్’ అనే ప్రత్యేక యాప్‌ను బోర్డ్ ప్రత్యేకంగా రూపొందించింది. ఈ యాప్‌ను దీన్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని, పరీక్షా కేంద్రాలు ఎక్కడున్నాయో తెలుసుకోవచ్చు. అలాగే తామున్న ప్రాంతం నుంచి ఎంత సమయంలో అక్కడికి చేరుకుం టామో సైతం దీని ద్వారా తెలుసుకోవచ్చు. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగనున్నాయి. వీటికోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,339 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటుచేశారు. విద్యార్థులు 8.45 కల్లా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. 9 గంటల తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు.
Published date : 29 Feb 2020 02:18PM