త్వరలో పోస్టుమెట్రిక్ విద్యార్థులకు ఉపకారవేతనాలు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని పోస్టుమెట్రిక్ విద్యార్థులకు శుభవార్త. విద్యా సంవత్సరం ముగిసేలోపే ఉపకారవేతనాలు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
వాస్తవానికి గతేడాదే ముందస్తు ఉపకారవేతనాలు ఇవ్వాలని భావించినప్పటికీ... దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఫిబ్రవరి దాకా కొనసాగడంతో పరిశీలన ప్రక్రియలో తీవ్ర జాప్యం జరిగింది. దీంతో పంపిణీ సైతం ఆలస్యం కాగా... 2018-19 విద్యా సంవత్సరంలో మాత్రం కోర్సు ముగిసేలోగా ఉపకారవేతనాలు ఇచ్చేలా చర్యలు వేగతరం చేసింది. ఇందులో భాగంగా విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తూనే... మరోవైపు వాటి పరిశీలన ప్రక్రియను చేపడుతోంది. దీంతో వచ్చిన దరఖాస్తులను వచ్చినట్లుగా పరిశీలిస్తే సమయం ఆదా కావడంతో పాటు విద్యార్థులకు కూడా మేలు జరుగుతుందని భావించిన యంత్రాంగం ఈమేరకు నిర్ణయం తీసుకుంది.
ఇప్పటివరకు 10.22లక్షలు దరఖాస్తులు..
2018-19 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకారవేతన దరఖాస్తుల స్వీకరణ ఈ ఏడాది జూలైలో మొదలైంది. అక్టోబర్ నెలాఖరులోగా దరఖాస్తుల స్వీకరణ పూర్తి చేయాలని ప్రభుత్వం భావించినప్పటికీ విద్యార్థుల నుంచి స్పందన అంతంతమాత్రంగానే వచ్చింది. అక్టోబర్ 30నాటికి కేవలం 2.5లక్షల మంది విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. పరిస్థితిని సమీక్షించిన ప్రభుత్వం దరఖాస్తు గడువును డిసెంబర్ 30వరకు పొడిగించింది. ఈక్రమంలో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, వికలాంగ కేటగిరీలకు చెందిన 10.22లక్షల మంది విద్యార్థులు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
పరిశీలన వెనువెంటనే అర్హత నిర్ధారణ...
ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాల కింద వచ్చిన దరఖాస్తుల పరిశీనలకు సంక్షేమ శాఖలు ఉపక్రమించాయి. విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించిన వెంటనే అవి కాలేజీ ప్రిన్‌సపల్ యూజర్ ఐడీకి వెళ్తాయి. వాటిని కాలేజీ యాజమాన్యం పరిశీలించిన తర్వాత ఆమోదిస్తూ సంక్షేమ శాఖాధికారికి సమర్పిస్తారు. అక్కడ బ్యాంకు ఖాతా, ఆధార్ పరిశీలన తర్వాత అర్హతను నిర్ధారిస్తారు. ప్రస్తుతం కాలేజీ స్థాయిలో పరిశీలన జరుగుతోంది.

Published date : 22 Dec 2018 02:24PM