త్వరలో 2,437 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 2న వివిధ కేటగిరీలకు చెందిన 2,437 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసేందుకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇదే విషయాన్ని ముఖ్య మంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈనెల 30న జరిగిన సమీక్షలో వెల్లడించింది. ఆ 2,437 పోస్టుల్లో అధిక సంఖ్యలో గురుకుల డిగ్రీ కాలేజీల లెక్చరర్లు, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు, నీటి పారుదల శాఖ, ఆర్ అండ్ బీ, ట్రైబల్ వెల్ఫేర్ తదితర శాఖల్లో సివిల్, ఎలక్ట్రికల్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి. అలాగే ములుగులోని ఫారెస్టట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రొఫెసర్లు, లైబ్రేరియన్ పోస్టులు ఉన్నాయి. మొత్తంగా జూన్ 2న 2437 పోస్టులకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయనుంది.
ఇవీ కేటగిరీల వారీగా పోస్టులు:
కేటగిరీ | పోస్టుల సంఖ్య |
గురుకుల డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ | 30 |
గురుకుల డిగ్రీ కాలేజీ లెక్చరర్లు | 546 |
గురుకుల డిగ్రీ కాలేజీ ఫిజికల్ డెరైక్టర్ | 21 |
గురుకుల డిగ్రీ కాలేజీ లైబ్రేరియన్ | 21 |
గురుకుల జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ | 6 |
గురుకుల జూనియర్ కాలేజీ ఫిజికల్ డెరైక్టర్ | 8 |
గురుకుల జూనియర్ కాలేజీ లెక్చరర్లు | 152 |
గురుకుల జూనియర్ కాలేజీ లైబ్రేరియన్ | 42 |
గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ | 304 |
వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (క్లాస్-బి కేటగిరీ-4) | 7 |
వెటర్నరీ అసిస్టెంట్ | 541 |
డిప్యూటీ సర్వేయర్ | 273 |
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ | 463 |
ఇన్‌స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ | 4 |
ప్రొఫెసర్స్ అండ్ లైబ్రేరియన్‌ఫారెస్టు కాలేజ్ | 19 |
మొత్తం | 2437 |
Published date : 31 May 2017 04:16PM