టీఎస్ ఇంటర్ కొత్త సిలబస్ పుస్తకాలు విడుదల
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ బోర్డు కొత్తగా రూపొందించిన మొదటి, రెండో సంవత్సరం హ్యుమానిటీస్ పుస్తకాలను శనివారం బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్, తెలుగు అకాడమీ డెరైక్టర్ సత్యనారాయణరెడ్డి విడుదల చేశారు.
ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ సిలబస్‌ను ప్రతి ఐదేళ్లకోసారి బోర్డు రివైజ్ చేస్తుంది. 2015-16 విద్యా సంవత్సరంలో సెకండియర్ కామర్స్, ఆర్థికశాస్త్రం, పొలిటికల్ సైన్స్, చరిత్ర, జీవశాస్త్రం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పుస్తకాలను రివైజ్ చేయగా... ప్రస్తుతం ఐదేళ్ల గడువు ముగియడంతో సవరించిన సిలబస్‌తో నూతన పుస్తకాలను రూపొందించారు. కొత్తగా ఇంటర్మీడియట్ కోర్సులో ప్రవేశించే వారికి ఈ పుస్తకాలు వర్తిస్తాయని బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.
Published date : 31 Aug 2020 05:13PM