తెలంగాణలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ ఫలితాలు 22 లేదా 23న
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలను ప్రాసెస్ చేస్తున్న కంప్యూటర్ ఏజెన్సీ అలసత్వం కారణంగా ఫలితాల వెల్లడిలో జాప్యం జరుగుతోంది.
వాస్తవానికి ఈ నెల 20న ఫలితాలు విడుదల కావాలి. కానీ దానికి సంబంధించిన పనులు సకాలంలో పూర్తి చేయక వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే ప్రస్తుతం ఒప్పందం చేసుకున్న సంస్థతో కాకుండా గతంలో పని చేసిన సంస్థతో అనధికారికంగా పనులు చేయిస్తున్నట్లు తెలిసింది. దీంతో సప్లిమెంటరీ ఫలితాలు ఈనెల 22 లేదా 23న విడుదలయ్యే అవకాశం ఉంది. ఫలితాల కోసం 5 లక్షల విద్యార్థులు ఎదురు చూస్తున్నారు.
Published date : 20 Jun 2016 04:49PM