తెలంగాణ జూ.కాలేజీలకు సెలవులు పొడిగింపు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జూనియర్ కాలేజీలకు ఇచ్చిన దసరా సెలవులను అక్టోబర్ 20 వరకు పొడిగిస్తూ తెలంగాణ ఇంటర్ బోర్డుఆదేశాలు జారీ చేసింది.
వాస్తవానికి అక్టోబర్ 18వ తేదీ వరకే సెలవులు ఇచ్చినప్పటికీ, తాజాగా 19, 20 తేదీలు కూడా సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు 21వ తేదీ ఆదివారం కావడంతో మొత్తంగా మరో మూడు రోజులు సెలవులుగా వెల్లడించింది. అక్టోబర్ 22వ తేదీన కాలేజీలు తిరిగి ప్రారంభం అవుతాయని ఇంటర్ బోర్డు పేర్కొంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కాలేజీలు ఈ సెలవు దినాలను పాటించాలని స్పష్టం చేసింది.
Published date : 19 Oct 2018 02:30PM