సప్లిమెంటరీ ఫలితాలకు ముందే రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ రిజల్ట్స్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాల్లో జరిగిన తప్పిదాలకు సంబంధించి బాధ్యులందరిపైనా చర్యలుంటాయని విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి స్పష్టం చేశారు.
ఏప్రిల్ 27 సాయంత్రం ఇంటర్ బోర్డు కార్యాలయంలో బోర్డు కార్యదర్శి అశోక్‌తో కలసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. త్రిసభ్య కమిటీ నివేదికకు సంబంధించిన అంశాలను ఆయన వివరించారు. ఫలితాల్లో కొన్ని పొరపాట్లు జరిగాయని, వాటిని సవరిస్తూ ఫలితాలను అప్‌డేట్ చేసినప్పటికీ ఆ వివరాలను మీడియాకు ఇవ్వకపోవడంతో గందరగోళం చోటుచేసుకుందన్నారు. త్రిసభ్య కమిటీ నివేదికను ప్రభుత్వం పరిశీలిస్తోందని, కమిటీ చేసిన సూచనలను సైతం పరిగణనలోకి తీసుకొని చర్యలు తీసుకుంటుందన్నారు. ఇకపై పక్కాగా, నూరు శాతం కచ్చితమైన ఫలితాలు ఇస్తామని స్పష్టం చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో అపోహలు తొలగించడానికి చర్యలు తీసుకుంటామని జనార్దన్‌రెడ్డి వివరించారు. రీ కౌంటింగ్‌కు 1.3 లక్షల దరఖాస్తులు వచ్చాయని, ఫెయిల్ అయిన వారందరి జవాబు పత్రాలను రీ వాల్యుయేషన్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఫీజు కట్టి రీ వాల్యుయేషన్ చేయించుకుంటున్న విద్యార్థులకు ఒకవేళ మార్కులు పెరిగితే ఫీజు తిరిగి ఇచ్చేలా చూస్తామన్నారు. బాధ్యులకు ఫైన్‌లు వేస్తామని, భవిష్యత్తులో మూల్యాంకనంలో వారు పాల్గొనకుండా డిబార్ చేస్తామన్నారు.
12 కేంద్రాల్లో రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్:
ఇంటర్ ఫలితాల రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కోసం విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులు రావడంతో ఈ ప్రక్రియ సజావుగా జరిగేందుకు పక్కాగా చర్యలు తీసుకున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్ మీడియాకు తెలిపారు. ‘‘సప్లిమెంటరీ ఫలితాలకు ముందే రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ ఫలితాలు వెల్లడిస్తాం. ఇందుకోసం ధరణి ప్రాజెక్టుకు ఉపయోగిస్తున్న స్కానర్లను వినియోగిస్తున్నాం. 12 కేంద్రాల్లో రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌లను కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించాం. రోజూ రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌పై బులిటెన్ విడుదల చేస్తాం. ఒక్కో కేంద్రంలో 70 వేల నుంచి లక్షన్నర జవాబు పత్రాల రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ చేస్తాం’’అని అశోక్ కుమార్ చెప్పారు.

Published date : 29 Apr 2019 04:17PM