Skip to main content

సీఓఈ కాలేజీల్లో ఇంటర్మీడియెట్ అడ్మిషన్లు

సాక్షి, హైదరాబాద్: గురుకుల సొసైటీలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ (సీఓఈ) కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియకు తెరలేచింది.
జేఈఈ, నీట్, ఎయిమ్స్, ఎంసెట్, క్లాట్, సీఏ-సీపీటీ తదితర పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చే ఈ కాలేజీల్లో 2020-21 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియెట్ ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీలు వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేశాయి. నవంబర్  28 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమై డిసెంబర్ 20తో ముగియనుంది. రాత పరీక్ష ద్వారా అర్హులను గుర్తించనున్నారు. 
 
 పదో తరగతి చదివే వారికే..
 సీఓఈ కాలేజీల్లో ప్రవేశాలకు ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులు. గురుకుల పాఠశాలల్లో చదివే విద్యార్థులతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో పదో తరగతి చదువుతున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యా ర్థులు ఏ సొసైటీలో సీటు పొందాలనుకుం టున్నారనే అంశాన్ని పరిశీలించుకుని  https://www.tswreis.in, http://www.tgtwgurukulam.telangana.gov.in వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలో 28 కాలేజీలు, ఎస్టీ గురుకుల సొసైటీ పరిధిలో 17 కాలేజీలున్నాయి. ఒక్కో కాలేజీలో 40 సీట్లుంటాయి. మొత్తంగా 1,800 సీట్లకు ప్రవేశాలు చేపట్టే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్, క్రిస్టియన్ మైనార్టీ విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు. నిబంధనలకు అనుగుణంగా నిర్దేశించిన రిజర్వేషన్ల ప్రకారం ప్రవేశాలు కల్పిస్తామని గురుకుల సొసైటీలు పేర్కొంటున్నాయి.
Published date : 28 Nov 2019 02:28PM

Photo Stories