Skip to main content

సీబీఎస్‌ఈ పరీక్షల నిర్వహణపై కమిటీ

న్యూఢిల్లీ: సీబీఎస్‌ఈ పరీక్షల నిర్వహణ, లోపాలపై సమీక్షించేందుకు కేంద్ర మానవ వనరుల శాఖ ఓ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. లీక్ తదితర లోపాల్లేకుండా సాంకేతికత సాయంతో భద్రమైన పద్ధతిలో పరీక్షలు నిర్వహించేందుకు ఈ కమిటీ తగు సూచనలు చేయనుంది.
ఏప్రిల్ 4న ఏర్పాటుచేసిన ఈ ఏడుగురు సభ్యుల కమిటీకి హెచ్చార్డీ మాజీ కార్యదర్శి వినయ్‌శీల్ ఒబెరాయ్ నేతృత్వం వహిస్తారు. మే 31కల్లా ఈ కమిటీ కేంద్రానికి నివేదిక అందజేస్తుందని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి అనిల్ స్వరూప్ వెల్లడించారు. సీబీఎస్‌ఈ వ్యవస్థలో భద్రతాపరమైన లోపాలను ఈ కమిటీ సమీక్షిస్తుందని, ట్యాంపరింగ్ లేకుండా ప్రశ్నపత్రాలు నేరుగా పరీక్షాకేంద్రాలకు చేరటంపైనా సూచనలు చేస్తుందన్నారు.  

పునఃపరీక్ష బోర్డు విచక్షణాధికారమే..
 ప్రశ్నపత్రం లీక్ అయిన 12వ తరగతి ఎకనమిక్స్ పరీక్షను మళ్లీ నిర్వహించాలన్న సీబీఎస్‌ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన ఐదు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసింది. పునఃపరీక్ష నిర్వహించటం సీబీఎస్‌ఈ విచక్షణ పరిధిలోకి వస్తుందని.. దీన్ని కోర్టు ప్రశ్నించలేదని జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ ఎస్‌ఏ బాబ్డేల ధర్మాసనం స్పష్టం చేసింది. 
Published date : 05 Apr 2018 02:52PM

Photo Stories