Intermediate Education: ఇంటర్ విద్య భవిష్యత్తుకు బాట..
సాక్షి ఎడ్యుకేషన్: పాఠశాల విద్య, గ్రాడ్యుయేషన్‌కు అనుసంధానంగా ఉన్న ఇంటర్మీడియెట్ విద్యార్థి దశలో ఎంతో కీలకమైనది. కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు ఇంటర్మీడియెట్‌నే అర్హతగా నిర్ధారించారు. పదో తరగతి పూర్తి చేసుకుని అనంతర కాలంలో దూరవిద్య ద్వారా నేరుగా డిగ్రీ చదివిన వారు కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు ఇంటర్మీడియెట్ సర్టిఫికెట్ లేక దరఖాస్తు చేసుకోలేని పరిస్థితి ఉంది. యూనిఫాం సర్వీసులకు ముఖ్యంగా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఇంటర్ సర్టిఫికెట్ తప్పనిసరి.
➤ Teacher as Athelete: ఆటల్లో సత్తా చాటిన ఉపాధ్యాయురాలు..
పదో తరగతి పూర్తి చేసుకొని కళాశాల విద్యలో అడుగిడిన విద్యార్థి ఇంటర్మీడియెట్ బోర్డు అందించే ఎంపీసీ, బైపీసీ, హెచ్‌ఈసీ, సీఈసీ, ఎంఈసీ వంటి కోర్సులలో చేరి తన భవిష్యత్‌కు బాట వేసుకుంటాడు. ఇంజినీర్, డాక్టర్, బ్యాంకర్, సివిల్ సర్వెంట్ తదితర రంగాలను ఎంచుకొనేందుకు ఇంటర్ విద్యను పునాదిగా భావిస్తారు. ఇంతటి ప్రాధాన్యమున్న ఇంటర్మీడియెట్ దశలో చాలా మంది వివిధ కారణాల వల్ల చదువుకు దూరమవుతున్నారు. ఫెయిలై కొందరు, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో కొందరు మధ్యలోనే విద్యకు ఫుల్‌స్టాప్ పెడుతున్నారు. దీనిని గమనించిన ప్రభుత్వం సదరు విద్యార్థులకు తిరిగి ఇంటర్మీడియెట్ విద్యను దగ్గర చేసేందుకు విప్లవాత్మక చర్యలు చేపట్టింది.
➤ AP High Court: ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ నరేందర్ ప్రమాణం
ప్రత్యేక డ్రైవ్
ఇంటర్మీడియెట్ విద్యను మధ్యలోనే వదిలివేసిన విద్యార్థులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. డ్రాపవుట్, పరీక్ష తప్పిన విద్యార్థులు తిరిగి ఇంటర్ చదివేలా ప్రవేశాలకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. గతంలో పరీక్షలు రాసి ఫెయిల్ అయిన వారు తిరిగి అడ్మిషన్ పొంది అన్ని పరీక్షలకు హాజరైతే ఎక్కువ మార్కులు వచ్చిన దానిని పరిగణనలోకి తీసుకుంటామని ఇంటర్ బోర్డు ప్రకటించింది.
➤ Free Course Interview: సివిల్స్ శిక్షణకు తేదీ విడుదల..
విద్యార్థులు తమ దగ్గరలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రైవేటు విద్యార్థులుగా ఫీజు చెల్లించి పరీక్షకు హాజరయ్యేందుకు అవకాశం కల్పించింది. వీరు ఉత్తీర్ణులైతే రెగ్యులర్ విద్యార్థుల్లానే ధ్రువపత్రాలు ఇస్తారు. దీంతోపాటు గత ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాలు, సప్లిమెంటరీకి హాజరైన విద్యార్థుల వివరాలను పరిగణనలోకి తీసుకొంటే దాదాపు 24 వేల మంది విద్యార్థులు ఇంటర్మీడియెట్ విద్యను అర్థాంతరంగా వదులుకున్నట్టు తెలుస్తోంది. వీరందరికీ మరో సదవకాశం లభించినట్టే.
➤ Dr Gubbala Rambabu: ఎక్కువ పనిగంటలు ప్రమాదకరం!
విద్యా పథకాలు వర్తిస్తాయి
ఇంటర్మీడియెట్ కళాశాల విద్యకు అర్థాంతరంగా దూరమై తిరిగి అడ్మిషన్ పొందే విద్యార్థులకు అన్ని ప్రభుత్వ పథకాలూ వర్తించేలా సర్కారు నిర్ణయం తీసుకొంది. గతంలో ఒకసారి కళాశాలలో చేరి ప్రభుత్వ పథకాలను పొంది మధ్యలో మానివేసి తిరిగి చేరితే వారికి మరోమారు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం లభించేది కాదు.
➤ Ballon d'Or Award 2023: బాలన్ డి'ఓర్ అవార్డు గెలుచుకున్న మెస్సీ
వారు అప్పటికే లబ్ధి పొంది ఉండటంతో మరోమారు వాటిని పొందేందుకు అనర్హులుగా పరిగణించేవారు. అయితే ప్రస్తుతం తిరిగి కొత్తగా అడ్మిషన్ పొంది అర్హత ఉన్న విద్యార్థులకు అమ్మఒడి, గోరుముద్ద, జగనన్న విద్యాకానుక వంటి ప్రభుత్వ పథకాలను తిరిగి వర్తింపజేయనున్నారు.
రీ అడ్మిషన్లకు ప్రత్యేక డ్రైవ్
ఇంటర్మీడియెట్ ఫెయిల్ అయిన విద్యార్థులు, డ్రాపవుట్ అయిన విద్యార్థుల కోసం ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. గత ఏడాది పరీక్షకు హాజరై తప్పిన విద్యార్థులు ఏ కారణం చేత 2024 మార్చిలో జరగనున్న పరీక్షకు ఫీజు చెల్లించటం లేదో తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. పల్నాడు జిల్లా పరిధిలో ఇంటర్ డీఐఈఓ ఎం.నీలావతిదేవి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆయా కళాశాలలకు వెళ్లి ప్రిన్సిపాల్స్ సమక్షంలో విద్యార్థులకు ఫోన్ చేసి విద్య ఆవశ్యకతను వివరిస్తూ తిరిగి అడ్మిషన్ పొందేలా అవగాహన కల్పిస్తున్నారు. అవసరమైతే ఆయా కళాశాలల సిబ్బందిని ఇళ్లకు పంపి విద్యార్థి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే వినుకొండ, సతైనపల్లి, పిడుగురాళ్ల ప్రాంతాలలోని కళాశాలలకు డీఐఈఓ వెళ్లి అక్కడి విద్యార్థులకు అవగాహన కల్పించారు.
➤ Show Cause Notice: జూనియర్ లెక్చరర్లకు షోకాజ్ నోటీసులు..
ఇంటర్.. బంగారు భవితకు బాట
విద్యార్థి జీవితంలో అత్యంత కీలకమైన ఇంటర్మీడియెట్ విద్యను వదులుకోవద్దు. మీ బంగారు భవిష్యత్‌కు ఇంటర్ విద్య బాటలు వేస్తుంది. మీకు నచ్చిన గ్రూప్‌లో తిరిగి చేరండి. ఇది ప్రభుత్వం కల్పించిన సదవకాశం. డ్రాపవుట్స్, రీ అడ్మిషన్ కోరే విద్యార్థులు ఏవైనా సందేహాలు ఉంటే సమీపంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సంప్రదించవచ్చు.
– ఎం.నీలావతిదేవి,
ఇంటర్ డీఐఈఓ, పల్నాడుజిల్లా
కళాశాలల్లో అవగాహన కల్పిస్తున్న ఇంటర్ బోర్డు సిబ్బంది