ఫస్టియర్‌లో ఎకనామిక్స్.. సెకండియర్‌లో సివిక్స్‌లో ఫెయిల్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరంలో సివిక్స్ సబ్జెక్టులో.. ప్రథమ సంవత్సరంలో ఎకనామిక్స్ సబ్జెక్టులో ఎక్కవ మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు.
ద్వితీయ సంవత్సరంలో 1,58,770 మంది సివిక్స్ పరీక్షకు హాజరు కాగా 1,11,078 మంది ఉత్తీర్ణులయ్యారు. మరో 47,692 మంది ఫెయిల్ అయ్యారు. ఇక ప్రథమ సంవత్సరంలో ఎకనామిక్స్ పరీక్షకు 1,55,136 మంది హాజరు కాగా 92,909 మంది ఉత్తీర్ణులయ్యారు. మరో 62,227 మంది ఫెయిల్ అయ్యారు. గ్రూపులవారీగా చూస్తే సీఈసీలో అత్యధికంగా విద్యార్థులు ఫెయిల్ కావడం గమనార్హం. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లోనూ అదే గ్రూపులో ఎక్కువ మంది ఫెయిల్ అయ్యారు. ద్వితీయ సంవత్సరం సీఈసీ పరీక్షలకు 1,42,861 మంది హాజరు కాగా 56,146 మంది ఉత్తీర్ణులు కాగా.. 86,715 మంది ఫెయిల్ అయ్యారు. అదే గ్రూపులో ప్రథమ సంవత్సరం పరీక్షలకు 1,21,806 మంది హాజరు కాగా 54,165 మంది ఉత్తీర్ణుల కాగా.. 67,641 మంది ఫెయిల్ అయ్యారు.
Published date : 14 Apr 2018 05:53PM