ఫిబ్రవరిలో ప్రాక్టికల్స్.. మార్చిలో తుది పరీక్షలు: తెలంగాణ ఇంటర్ బోర్డు
Sakshi Education
హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ ఫిబ్రవరి మొదటి వారంలో ప్రాక్టికల్స్, వార్షిక పరీక్షలు మార్చి తొలి వారంలో నిర్వహించనున్నారు.
ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా ఇంటర్ విద్యాధికారులకు (డీఐఈవో), జూనియర్ కాలేజీ ప్రిన్సిపాళ్లకు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ ఆదేశాలు జారీచేశారు. విద్యార్థులు చెల్లించిన ఫీజులను వెంటనే బోర్డుకు పంపాలన్నారు. రాష్ట్రంలోని 404 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో స్టూడెంట్ కౌన్సెలర్లను నియమించి శిక్షణ కూడా ఇచ్చినందున.. పరీక్షల సమయంలో ఒత్తిడికి గురికాకుండా విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇప్పించాలని సూచించారు. ప్రైవేటు జూనియర్ కాలేజీల్లోనూ యాజమాన్యాలు కౌన్సెలర్లను నియమించుకోవాలని ఆదేశించారు. ఇంటర్ పరీక్షల నామినల్ రోల్స్‌లో తప్పులు, పొరపాట్లు సరిచేసుకోవడానికి కాలేజీలకు నవంబర్ 30 వరకు గడువు విధించినట్లు కార్యదర్శి తన ఆదేశాల్లో పేర్కొన్నారు. మాతృభాష, మతం, సబ్‌క్యాస్ట్, జెండర్, కమ్యూనిటీ, ఫొటో/విద్యార్థి సంతకం వంటి వాటిలో సవరణల కోసం tsbie.cgg.gov.in లేదా admi.tsbie.cgg.gov.in వెబ్‌సైట్ సంప్రదించాలని సూచించారు. కాలేజీకి వెళ్లకుండా ప్రైవేటుగా మార్చిలో నిర్వహించే ఇంటర్మీడియట్ పరీక్షలు రాయాలనుకొనే అభ్యర్థులు రూ.1,000 ఆలస్య రుసుంతో నవంబర్30 వరకు ఫీజు చెల్లించుకోవడానికి ఇంటర్‌బోర్డు అవకాశం కల్పించింది.
For inter practicals guidance, check here
For inter practicals guidance, check here
Published date : 25 Nov 2019 03:16PM