ఫిబ్రవరి 27 నుంచి తెలంగాణ ఇంటర్ పరీక్షలు?
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షలను వచ్చే ఏడాది ఫిబ్రవరి 27 నుంచి నిర్వహించాలని తెలంగాణ ఇంటర్ బోర్డు యోచిస్తోంది. ఈ మేరకు కసరత్తు ప్రారంభించింది.
ఫిబ్రవరి 27 నుంచి మార్చి 16 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను, ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు రెండో సంవత్సరం పరీక్షలను నిర్వహించాలని భావిస్తోంది. అలాగే ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి 20 వరకు నిర్వహించనున్నట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ పరీక్షలను ఈ తేదీల్లోనే నిర్వహించేందుకు ఏపీ ఇంటర్ బోర్డు నవంబర్ 14న షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఇంటర్ బోర్డు కూడా ఆ షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది.
Published date : 15 Nov 2018 03:49PM