ఫిబ్రవరి 1 నుంచి ఏపీ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు
Sakshi Education
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ విద్యార్థులకు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
ఫిబ్రవరి 20వ తేదీ వరకు జరిగే ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 3,37,054 మంది హాజరుకానున్నారు. వీరికోసం 905 కేంద్రాలను నెలకొల్పినట్లు ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. www.bie.ap.gov.in వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థుల వివరాల్లో తప్పులుంటే సంబంధిత ధ్రువపత్రాలను ప్రాంతీయ తనిఖీ అధికారి కార్యాలయంలో సమర్పించి జనవరి 31 (శుక్రవారం) లోపు సరిచేయించుకోవాలని సూచించారు. పరీక్షలకు సంబంధించిన సందేహాల నివృత్తికి సహాయ కేంద్రాలను అందుబాటులో ఉంచుతామన్నారు.
Published date : 31 Jan 2020 02:43PM