Skip to main content

పరీక్ష ఫీజు కట్టిన ఇంటర్ విద్యార్థులందరూ పాస్.. ఏపీ ప్రభుత్వ నిర్ణయం!

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఏడాది మార్చిలో ఇంటర్ పరీక్షలకు ఫీజు చెల్లించిన విద్యార్థులందరినీ ఉత్తీర్ణులుగా పరిగణిస్తూ ప్రభుత్వం ప్రత్యేక నిర్ణయం తీసుకుంది.

2020-మార్చి పరీక్షలకు ఫీజు కట్టిన అభ్యర్థుల్లో పరీక్ష రాసి ఫెయిలైన వారు, మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడిన వారు, పరీక్షలకు హాజరు కాలేకపోయిన వారందరూ ఉత్తీర్ణులైనట్లుగా పరిగణిస్తున్నట్లుబోర్డు మంగళవారం ప్రకటించింది.

  • ఈ విద్యార్థులు విద్యా సంవత్సరం కోల్పోకుండా ఉండేందుకు తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు ఇతర వర్గాలనుంచి వచ్చిన విన్నపాల మేరకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పెషల్ కన్సిడరేషన్ కింద వీరందరినీ ఉత్తీర్ణులుగా ప్రకటించారు. దీంతో 44 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. వీరిలో మాల్ ప్రాక్టీస్ అభ్యర్థులు 66 మంది ఉన్నారు.
  • కోవిడ్-19 కారణంగా అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఇంతకు ముందే మార్చిలో ఫెయిలైన విద్యార్థులందరినీ పాస్‌అయినట్లుగా ప్రకటించింది.
  • అయితే ఆబ్సెంట్, మాల్‌ప్రాక్టీస్ అభ్యర్థులకూ తాజా నిర్ణయంతో మేలు జరుగుతోంది. వీరందరినీ కంపార్టుమెంటల్‌పాస్‌గా పరిగణిస్తూ మార్కుల మెమోలను జారీచేయనున్నారు.
  • బీఐఈ.ఏపీ.జీఓవీ.ఐఎన్ వెబ్‌సైట్లో బుధవారం మధ్యాహ్నం తరువాత వీరి షార్ట్‌మార్కుల మెమోలు అందుబాటులో ఉంటాయని ఇంటర్మీడియెట్‌బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ ప్రకటనలో వివరించారు.
Published date : 26 Aug 2020 01:24PM

Photo Stories