పరీక్ష కోసం 10 కి.మీ. ప్రయాణం
Sakshi Education
సాక్షి, అమరావతి: ఇంటర్ పరీక్షా కేంద్రాల కేటాయింపు అస్తవ్యస్తంగా మారడం పట్ల విద్యార్ధుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 27వ తేదీ నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఒకపక్క ఎండలు మండుతున్న తరుణంలో 10 కిలోమీటర్లకు పైగా దూరంలో పరీక్షా కేంద్రాలను కేటాయించడంపై విద్యార్ధుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరీక్షల సమయంలో విద్యార్ధులకు ప్రతి నిమిషం చాలా విలువైనదే. పరీక్షా కేంద్రాలు చేరువలో ఉంటే ట్రాఫిక్ ఇబ్బందుల్లో ఇరుక్కోకుండా సమయానికి చేరుకునే వీలుంటుందని పేర్కొంటున్నారు. 10 కిలోమీటర్లకు పైగా వెళ్లాలంటే చాలా ముందుగానే బయలుదేరాల్సి ఉంటుందని వాపోతున్నారు. భద్రత నేపథ్యంలో విద్యార్థినులతోపాటు రోజూ వారి కుటుంబ సభ్యులు కూడా వెళ్లక తప్పని పరిస్థితి నెలకొంది. ఇవన్నీ పట్టించుకోకుండా ఇష్టానుసారంగా పరీక్షా కేంద్రాలు కేటాయించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ లాంటి చోట కూడా పది కిలోమీటర్లకు పైగా దూరంలో పరీక్షా కేంద్రాలను కేటాయించారంటే గ్రామీణ ప్రాంత విద్యార్ధుల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రీజనల్ ఇన్‌స్పెక్టింగ్ అధికారులు (ఆర్‌ఐఓ)లు పంపిన సమాచారం ఆధారంగానే బోర్డు జంబ్లింగ్ విధానంలో కంప్యూటరాధారితంగా పరీక్షా కేంద్రాల కేటాయింపు జరిపిందని బోర్డు సిబ్బంది పేర్కొంటున్నారు.
సమస్యలుంటే సరి చేయిస్తాం: ఇంటర్ బోర్డు కార్యదర్శి
పరీక్షా కేంద్రాల కేటాయింపులో ఎక్కడైనా సమస్యలుంటే పరిశీలించి సరి చేయిస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి బి.ఉదయలక్ష్మి ‘సాక్షి’కి తెలిపారు. సుదూర ప్రాంతంలో పరీక్షా కేంద్రాలను కేటాయించిన విద్యార్ధులకు సమీపంలో కేటాయించేలా చర్యలు చేపడతామన్నారు.
ఫిబ్రవరి 23 నుంచి హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్ :
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ పరీక్షలు ఫిబ్రవరి 27వ తేదీ నుంచి మార్చి 18వ తేదీవరకు జరగనున్న నేపథ్యంలో ప్రశాంతంగా నిర్వహించడంపై బోర్డు కార్యదర్శి ఉదయలక్ష్మి ఫిబ్రవరి 22న వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. పరీక్షల నియంత్రణాధికారి రమేష్‌తోపాటు ఆర్‌జేడీలు, డీవీఈఓలు, ఆర్‌ఐఓలు, ఇతర అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రశ్నపత్రం సెట్ నెంబర్‌ను ప్రతి అధికారికి మెసేజ్ ద్వారా పంపిస్తామని తెలిపారు. మెసేజ్‌లో పేర్కొన్న సెట్ నెంబర్ ప్రశ్నపత్రాన్ని మాత్రమే విద్యార్ధులకు పంపిణీ చేయాలన్నారు. ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలుంటాయని కార్యదర్శి హెచ్చరించారు. హాల్‌టిక్కెట్ల్లు ఫిబ్రవరి 23 మధ్యాహ్నం నుంచి అందుబాటులో ఉంటాయని బోర్డు ప్రజా సంబంధాల అధికారి సికిందర్ తెలిపారు.
- కర్నూలు జిల్లాలో ఓ కళాశాల విద్యార్థులకు ఏకంగా 20 కిలోమీటర్ల దూరంలోని కాలేజీని పరీక్షా కేంద్రంగా కేటాయించారు.
- విజయవాడ మొగల్రాజపురంలోని కాలేజీ విద్యార్ధులకు కంకిపాడులో పరీక్షా కేంద్రాన్ని కేటాయించారు. మరో విద్యార్థికి పోరంకిలోని కాలేజీని పరీక్షా కేంద్రంగా కేటాయించారు.
సమస్యలుంటే సరి చేయిస్తాం: ఇంటర్ బోర్డు కార్యదర్శి
పరీక్షా కేంద్రాల కేటాయింపులో ఎక్కడైనా సమస్యలుంటే పరిశీలించి సరి చేయిస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి బి.ఉదయలక్ష్మి ‘సాక్షి’కి తెలిపారు. సుదూర ప్రాంతంలో పరీక్షా కేంద్రాలను కేటాయించిన విద్యార్ధులకు సమీపంలో కేటాయించేలా చర్యలు చేపడతామన్నారు.
ఫిబ్రవరి 23 నుంచి హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్ :
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ పరీక్షలు ఫిబ్రవరి 27వ తేదీ నుంచి మార్చి 18వ తేదీవరకు జరగనున్న నేపథ్యంలో ప్రశాంతంగా నిర్వహించడంపై బోర్డు కార్యదర్శి ఉదయలక్ష్మి ఫిబ్రవరి 22న వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. పరీక్షల నియంత్రణాధికారి రమేష్‌తోపాటు ఆర్‌జేడీలు, డీవీఈఓలు, ఆర్‌ఐఓలు, ఇతర అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రశ్నపత్రం సెట్ నెంబర్‌ను ప్రతి అధికారికి మెసేజ్ ద్వారా పంపిస్తామని తెలిపారు. మెసేజ్‌లో పేర్కొన్న సెట్ నెంబర్ ప్రశ్నపత్రాన్ని మాత్రమే విద్యార్ధులకు పంపిణీ చేయాలన్నారు. ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలుంటాయని కార్యదర్శి హెచ్చరించారు. హాల్‌టిక్కెట్ల్లు ఫిబ్రవరి 23 మధ్యాహ్నం నుంచి అందుబాటులో ఉంటాయని బోర్డు ప్రజా సంబంధాల అధికారి సికిందర్ తెలిపారు.
Published date : 23 Feb 2019 03:41PM