పకడ్బందీగా ఇంటర్ ప్రాక్టికల్స్
Sakshi Education
సాక్షి, నెట్‌వర్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు సీసీటీవీలను ఏర్పాటు చేయాలని మంత్రి గంటా శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు.
ప్రశ్నపత్రాలను ఆన్‌లైన్లో విడుదల చేయాలన్నారు. జనవరి 23న ఆయన కాకినాడ జేఎన్టీయూ నుంచి ఇంటర్ కళాశాల ప్రిన్సిపాళ్లతో వీడియా కాన్ఫరెన్‌స, ప్రాక్టికల్ పరీక్షలపై సమీక్ష నిర్వహించారు. కాగా, ఇంటర్‌లో ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్; ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ ప్రశ్నపత్రాలను ఆన్‌లైన్ ద్వారా విడుదల చేయనున్నారు. వీడియో కాన్ఫరెన్‌సలో ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి బి.ఉదయలక్ష్మి, పరీక్షల నియంత్రణాధికారి వి.రమేష్, ఇంటర్మీడియెట్ విద్యామండలి ఓఎస్డీ ఎల్‌ఆర్ బాబాజీ తదితరులు సమీక్షకు హాజరయ్యారు.
Published date : 24 Jan 2018 02:13PM