పేటీఎంతో జేఈఈ ఫీజు చెల్లింపు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో జేఈఈ దరఖాస్తు ఫీజును క్రెడిట్, డెబిట్ కార్డులు, ఈ-చలానాతోపాటు ఈ-వాలెట్, పేటీఎం, ఎస్‌బీఐ బడ్డీ ద్వారా విద్యార్థులు చెల్లించేందుకు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) చర్యలు చేపట్టింది.
గతంలో క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, ఈ-చలానా ద్వారా ఫీజు చెల్లించే అవకాశం కల్పించిన సీబీఎస్‌ఈ ఈ సారి మాత్రం ఈ-వాలెట్, పేటీఎం, ఎస్‌బీఐ బడ్డీ ద్వారా ఫీజులు చెల్లించే అవకాశం కల్పించింది. ప్రస్తుతం నగదు రహిత చర్యల్లో భాగంగా ఈ-వాలెట్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. పేటీఎం ద్వారా 1.5 శాతం, ఎస్‌బీఐ బడ్డీ ద్వారా రూ. 20 అదనంగా చెల్లించాలని తెలిపింది.
Published date : 08 Dec 2016 03:17PM