Skip to main content

పది పరీక్షల ఫీజు గడువు అక్టోబర్ 29

హైదరాబాద్: తెలంగాణలో మార్చి-2020లో నిర్వహించనున్న పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లించడానికి అక్టోబర్ 29 వరకు గడువు విధించినట్లు ఎస్సెస్సీ బోర్డు డెరైక్టర్ బి.సుధాకర్ తెలిపారు.
రూ.50 ఆలస్య రుసుంతో నవంబర్ 13 వరకు, రూ.500 ఆలస్య రుసుంతో డిసెంబర్ 11 వరకు గడువు విధించామని చెప్పారు. ఆ తర్వాత ఫీజు చెల్లింపునకు గడువు పొడిగించే అవకాశం లేదన్నారు. నామినల్ రోల్స్‌ను ఆన్‌లైన్ ద్వారా పంపాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. రెగ్యులర్ విద్యార్థులు పదో తరగతి పరీక్ష ఫీజు అన్ని సబ్జెక్ట్‌లకూ రూ.125, ఒకేషనల్ విద్యార్థులకు సాధారణ పరీక్ష ఫీజుకంటే రూ.60 అదనంగా చెల్లించాలని పేర్కొన్నారు.
Published date : 27 Sep 2019 04:06PM

Photo Stories