ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ ఫీజు గడువు పెంపు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో ఏప్రిల్/మే నెలల్లో నిర్వహించే ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్ పరీక్షలకు మార్చి 8వ తేదీలోగా ఫీజు చెల్లించాలని సొసైటీ తెలిపింది.
ఒక్కో పేపరుకు రూ. 25 ఆలస్య రుసుముతో 9 నుంచి 13వ తేదీ వరకు, రూ. 50 ఆలస్య రుసుముతో 14 నుంచి 18వ తేదీ వరకు ఫీజు చెల్లించొచ్చని ఈనెల 27న ఒక ప్రకటనలో పేర్కొంది. విద్యార్థులు పరీక్ష ఫీజును మీసేవా/ఏపీ ఆన్‌లైన్ కేంద్రాల్లోనే చెల్లించాలని.. చలానాలు, డీడీలు స్వీకరించబోమని స్పష్టం చేసింది. ఎస్సెస్సీ పరీక్ష కోసం ఒక్కో పేపరుకు రూ. 100 చొప్పున 5 పేపర్లకు రూ.500.. ఇంటర్మీడియట్‌కు ఒక్కో పేపరుకు రూ. 150 చొప్పున 5 పేపర్లకు రూ. 750 చెల్లించాలని సొసైటీ డెరైక్టర్ వెంకటేశ్వరవర్మ వెల్లడించారు.
Published date : 28 Feb 2017 03:00PM