నవంబర్ 30 వరకు ఇంటర్ ప్రవేశాల గడువు పెంపు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల గడువును ఈ నెల 30 వరకు పొడిగించినట్టు బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు.
రాష్ట్రంలోని అన్ని ఇంటర్ కాలేజీల ప్రిన్సిపాళ్లు ఈ నెల 30 వరకు ప్రవేశాలకు అనుమతించాలని కోరడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
Published date : 19 Nov 2020 01:53PM