నాలుగేళ్ల తర్వాత ఇంటర్‌లో మళ్లీ అప్రెంటిస్‌షిప్: విద్యాశాఖ
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సులు చదివే, ఇప్పటికే చదువుకున్న విద్యార్థులకు శుభవార్త.
నాలుగేళ్ల తర్వాత మళ్లీ వారి కోసం ఇంటర్మీడియట్ విద్యాశాఖ అప్రెంటిస్‌షిప్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా గత నాలుగేళ్ల పాటు ఇంటర్‌లో వొకేషనల్ కోర్సుల విద్యార్థులకు అప్రెంటిస్‌షిప్ చేసే అవకాశం లేకుం డా పోయింది. ఏడాది కాలం అప్రెంటిస్‌షిప్ చేయనందున ప్రభుత్వ ఉద్యోగాలకు తాము అనర్హులం అవుతున్నామని విద్యార్థులు ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో ఇంటర్ వొకేషనల్ కోర్సులను రీజనల్ డెరైక్టరేట్ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (ఆర్డీఎస్‌డీఈ) పరిధిలోకి తీసు కువచ్చేలా ఇంటర్మీడియట్ విద్య కమిషనర్ సయ్యద్ ఉమర్ జలీల్ చేసి న ప్రయత్నం ఫలించింది. దీంతో ఇంటర్‌లో పారా మెడికల్, ఇతర సాంకేతిక విద్యా కోర్సులను చదివే విద్యార్థులకు అప్రెంటిస్‌షిప్ అవకాశం కల్పించే సంస్థలు ఆర్డీఎస్‌డీఈలో నమోదు చేసుకునేలా చర్యలు చేపట్టారు.
ఆ కోర్సుల విద్యార్థులు కావాలి..
బుధవారం హైదరాబాద్‌లోని 46 ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఆయా సంస్థల్లో అప్రెంటిస్‌షిప్ విద్యార్థుల అవసరాలపై చర్చించారు. వారంతా తమకు ఫార్మా టెక్నాలజీ (పీహెచ్‌టీ), మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ (ఎంఎల్‌టీ), ఫిజియోథెరపీ (పీటీ), మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ (ఫిమేల్) వంటి కోర్సులు చేసిన విద్యార్థులు కావాలని అడిగారు. అయితే ఆయా సంస్థలు ఆర్డీఎస్‌డీఈ కార్యాలయంలో నమోదు చేసుకోవాలని సూచించారు. వచ్చే మార్చి/ఏప్రిల్‌లో అప్రెంటిస్ మేళా నిర్వహిస్తామని పేర్కొన్నారు. అందులో పాల్గొని విద్యార్థులను ఎంపిక చేసుకోవాలని కోరారు. అందులో ప్రస్తుతం ద్వితీయ సంవత్సర చదువుతున్న పీహెచ్‌టీ విద్యార్థులు 167 మంది, ఎంఎల్‌టీ చదువుతున్న 8,787 మంది, పీటీ చదువుతున్న 397 మంది, ఎంపీహెచ్‌డబ్ల్యూ చదువుతున్న 10,198 మందితోపాటు గతంలో ఈ కోర్సులను పూర్తిచేసిన విద్యార్థులు పాల్గొనేలా చర్యలు చేపడతామన్నారు. తద్వారా వారికి ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని, వారికి ఉద్యోగార్హత లభిస్తుందని వివరించారు. మరోవైపు ఈ సమావేశంలో పారా మెడికల్ అప్రెంటిస్‌షిప్ విధానంపై ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ఇంటర్మీడియట్ బోర్డు, ఇంటర్ విద్యా కమిషనరేట్, తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్, తెలంగాణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్, ఆర్డీఎస్‌డీఈ నుంచి ఒకరిని సభ్యులుగా ఉండేలా చర్యలు చేపట్టారు. ఈ కమిటీ ప్రతి 3 నెలలకోసారి సమావేశమై అప్రెంటిస్‌షిప్ విధానం, సిలబస్‌లో మార్పులు తదితర అంశాలపై చర్చించి చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.
కొత్త కోర్సులు ప్రవేశపెట్టాలి..
సమావేశంలో రేడియోథెరపీ అసిస్టెంట్, డయాలసిస్ అసిస్టెంట్, మిడ్‌వైఫరీ, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, మేనేజర్ ఆన్ డ్యూటీ వంటి కోర్సులను ప్రవేశపెట్టాలని, వాటి అవసరం ఎక్కువ గా ఉందని ఆస్పత్రుల యాజమాన్యాలు కోరారు. అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టామని ఉమర్ జలీల్ పేర్కొన్నారు. ఉపాధి కల్పించే కోర్సుల ను ప్రవేశపెట్టడంపై వచ్చే వారంలో రాష్ట్రానికి రానున్న సెంచూరియన్ యూనివర్సిటీ ప్రతినిధులతోనూ చర్చించాలని నిర్ణయించారు.

Published date : 23 Jan 2020 02:36PM