Skip to main content

మే 27న జేఈఈ అడ్వాన్స్‌డ్‌

సాక్షి, హైదరాబాద్: ఐఐటీల్లో ప్రవేశాల కోసం మే 19న నిర్వహించాల్సిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2019 పరీక్ష వాయిదా పడింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను మే 27న నిర్వహిస్తామని ఐఐటీ రూర్కీ ప్రకటించింది.
ఈ మేరకు మార్చి 19న రివైజ్డ్ షెడ్యూల్‌ను జారీ చేసింది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం మే 19న ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించేలా చర్యలు చేపట్టింది. అయితే మే 19న 8 రాష్ట్రాల్లోని 59 నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహించేలా కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బంది తలెత్తకుండా పరీక్ష తేదీని మార్చినట్లు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ నిర్వాహక సంస్థ ఐఐటీ రూర్కీ వెల్లడించింది. మే 27న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1 పరీక్షను, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్షను నిర్వహించనున్నారు. మరోవైపు జేఈఈ మెయిన్‌లో టాప్ 2.24 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్‌ కు అనుమతించనున్నారు. జేఈఈ మెయిన్ ఫలితాల అనంతరం జేఈఈ అడ్వాన్స్‌డ్‌ కు రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. వీటికి సంబంధించిన వివరాలను వెబ్‌సైట్‌లో పొందవచ్చు.

ఇదీ సవరించిన షెడ్యూల్...
బీఈ/బీటెక్ కోసం జేఈఈ మెయిన్ పరీక్షలు: ఏప్రిల్ 8, 9, 10, 12 తేదీల్లో
జేఈఈ మెయిన్ ఫలితాలు: 30-4-2019
జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభం: 3-5-2019
జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రిజిస్ట్రేషన్లు ముగింపు: 9-5-2019
రిజిస్టర్డ్ అభ్యర్థులు ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: 10-5-2019
అభ్యర్థుల హాల్‌టికెట్ల(అడ్మిట్‌కార్డు) డౌన్‌లోడ్‌కు అవకాశం: 20-5-2019 నుంచి
జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష: 27-5-2019
అభ్యర్థులకు వారి రెస్పాన్‌‌స షీట్లు పంపిణీ: 29-5-2019 నుంచి 1-6-2019 వరకు
‘కీ’ విడుదల తేదీ : 4-6-2019
‘కీ’లపై అభ్యంతరాల స్వీకరణ: 4-6-2019 నుంచి 5-6-2019 వరకు
జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల వెల్లడి: 14-6-2019
ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌కు ఆన్‌లైన్లో రిజిస్ట్రేషన్: 14-6-2019 నుంచి 15-6-2019 వరకు.
ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టు: 17-6-2019
ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టు ఫలితాలు: 21-6-2019
Published date : 20 Mar 2019 02:23PM

Photo Stories